twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రైడ్’ ట్రైలర్: రియల్ స్టోరీతో... సినిమా అదిరిపోయేలా ఉంది!

    By Bojja Kumar
    |

    Recommended Video

    రైడ్’ ట్రైలర్: రియల్ స్టోరీతో

    బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రం 'రైడ్'. 1981లో లక్నోలో జరిగిన కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక పవర్‌ఫుల్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

    ట్రైలర్ అదుర్స్

    తాజాగా విడుదలైన ‘రైడ్' ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. గవర్నమెంట్ ఆఫీసర్లు వెళ్లడానికి భయపడే అవినీతి పరులను ఓ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ. 7 ఏళ్ల వ్యవధిలో 49 సార్లు ట్రాన్స్‌ఫర్ అయిన పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నారు.

    రాజ్ కుమార్ గుప్తా

    రాజ్ కుమార్ గుప్తా

    గతంలో అమీర్, నో వన్ కిల్డ్ జెస్సికా లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓంకారా, దృశ్యం, ఎయిర్ లిఫ్ట్, బాబీ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    ఇలియానా

    ఇలియానా

    గతేడాది అజయ్ దేవగన్‌తో ‘బాద్ షా హో' చిత్రంలో నటించిన ఇలియానా... మరోసారి ఆయనకు జోడీగా ‘రైడ్' చిత్రంలో కనిపించబోతోంది. అజయ్-ఇలియానా మధ్య కెమిస్ట్రీ తెరపై మరింత రంజుగా చూపించబోతున్నారు.

    విడుదల తేదీ ఖరారు

    విడుదల తేదీ ఖరారు

    మార్చి 16వ తేదీన ‘రైడ్' చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పానోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    English summary
    Star Ajay Devgn unveiled the first trailer for Raid, just a few hours after sharing the first poster for the social drama on Twitter. The film, set in 1981, tells the story of an income tax officer in Lucknow, who takes on the ‘powerful corrupt’ in an effort to help the poor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X