థియేటర్ల కోసం...ఆ ఇద్దరు టాప్ హీరోల గొడవ!

By Bojja Kumar

ముంబై : ఈ కాలంలో సినిమా తీయడం గొప్ప కాదు....సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసుకునే సత్తా ఉందా? లేదా? అనేదే గొప్ప. ఈ ఫార్ములా ద్వారా సినిమా ఆడినా, ఆడక పోయినా నిర్మాత సేఫ్. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ వుడ్ చూసినా......టాప్ హీరోలు, టాప్ దర్శకులు, టాప్ నిర్మాతల సినిమాలు భారీ రేంజిలోనే రిలీజ్ అవుతాయి.

త్వరలో దీపావళి పండగ వస్తుండటంతో...పండగ సీజన్లో సినిమాలను విడుదల చేసి భారీ కలెక్షన్ రాబట్టేందుకు పలు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే బాలీవుడ్లో ఈ నెల 13న విడుదలకు సిద్ధం అవుతున్న షారుక్ ఖాన్ 'జబ్ తక్ హై జాన్', అజయ్ దేవగన్ 'సన్ ఆఫ్ సర్దార్' సినిమాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి.

'జబ్ తక్ హై జాన్' చిత్రాన్ని నిర్మించిన యశ్ రాజ్ ఫిలింస్ వారు భారీగా థియేటర్లను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అజయ్ దేవగన్ ఫిలింస్ సంస్థ వారికి ఆశించిన థియేటర్ల లభించడం లేదు. దీంతో రెండు సంస్థలు గొడవకు దిగాయి. యశ్ రాజ్ ఫిలింస్ అన్యాయంగా ప్రదర్శన కారులను బెదిరించి థియేటర్లను దక్కించుకుంటున్నారని అజయ్ దేవగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆ సంస్థకు నోటీసులు కూడా పంపారు.

అయితే యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ వాదన మాత్రం వేరేలా ఉంది. తాము గతేడాదే విడుదల తేదీ ఖరారు చేసుకున్నామని, అప్పుడే థియేటర్లను ముందస్తుగా బుక్ చేసుకున్నామని. అజయ్ దేవగన్ ఫిలింస్ సంస్థ నుంచి వచ్చే 'సన్ ఆఫ్ సర్దార్' విడుదల తేదీ ఈ ఏడాదే ఖరారైందని, వారికి థియేటర్లు దొరకకపోతే మమ్మల్ని తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నిస్తోంది.

తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా మర్యాద రామన్న హిందీ లో 'సన్ ఆఫ్ సర్దార్'గా రీమేక్ అయింది. ఇందులో అజయ్ దేవగన్ మరియు సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఈ సినిమాని అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు, ఈ సినిమాని దీపావళి సంధర్బంగా నవంబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది, తెలుగులో మర్యాద రామన్న సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అందుకే సన్ ఆఫ్ సర్దార్ మీద కూడా అందరి అంచనాలు ఎక్కువగా వున్నాయి.

'జబ్ తక్ హై జాన్' చిత్రానికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు. యష్ చోప్రా ఇటీవలే డెంగ్యూతో మరణించారు. ఈచిత్రంలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 13న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్. రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా, ఎడిటింగ్: నమ్రతరావు, స్క్రీన్ ప్లే: ఆదిత్య చోప్రా, దేవిక భగత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X