వేరు వేరు రంగాల్లో దిగ్గజాలు.. ఓకే ఫ్రేమ్‌లో ఆ ఇద్దరూ.. వైరల్ పిక్
అన్ని రంగాల్లోనూ దిగ్గజాలు ఉంటారు. తమ తమ టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే గాక, అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంటారు కొందరు. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, టీం ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆ ఇద్దరూ ఇప్పుడు ఓకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన 'భారత్‌లో సినిమా, క్రికెట్ రెండూ ఒకే మతం' అని ట్యాగ్ చేశారు. దీంతో ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫొటో చూసిన అభిమానులు వేల సంఖ్యలో లైకులు కొడుతూ రీట్వీట్లు చేస్తున్నారు.

ఇలా ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలను చూడటం సంతోషంగా ఉందని ఎంఎస్ ధోనీ, అజయ్ దేవ్‌గణ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టుకు ఇప్పటికే 46,000 లైక్‌లు వచ్చాయి. అలాగే 9.4 వేల మంది రీట్వీట్‌లు చేసారు. మరికొందరు వీరిద్దరిపై జోకులతో కూడిన మీమ్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్' ఈ రోజు విదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధోనీని అజయ్ దేవగణ్ కలిశారు.
కాగా అజయ్ దేవగణ్ చేసిన ఈ పోస్టుపై మరో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి స్పందించారు. 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. ఫొటోలో ఇద్దరు చించేశారు' అని పేర్కొన్నారు. అజయ్ దేవగణ్ చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్'. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. కాజోల్, శరద్ కేల్కర్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











