twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దృశ్యం' సినిమాకు పన్ను మినహాయింపు ...కృతజ్ఞతలు

    By Srikanya
    |

    ముంబై: అజయ్ దేవగన్, శ్రేయ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం. ఈ సినిమా ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఈ సినిమాకు పన్ను మినహాయించారు. తన సినిమాకు పన్ను మినహాయించినందుకు కృతజ్ఞతలంటూ అజయ్‌ ట్విట్టర్‌ ద్వారా యూపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడండి.

    దీంతో ప్రజలందరూ తన సినిమా చూసేందుకు అవకాశం దొరికిందన్నారు. ఇటీవల మాసాన్‌, బజరంగీ భాయిజాన్‌, హమారీ అధూరీ కహానీ లాంటి చిత్రాలకు కూడా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోద పన్ను మినహాయించిన విషయం తెలిసిందే

    ఇక ఈ చిత్రాన్ని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ రీసెంట్ గా చూసారు. ఆయన ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడాల్సిన చిత్రంగా చెప్పారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు.

    Ajay Devgn thanks Akhilesh for making 'Drishyam' tax-free

    ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే.

    నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు.

    'దృశ్యం' సినిమాకు వస్తున్న స్పందన పట్ల హీరో అజయ్ దేవగణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది అరుదైన చిత్రమని పేర్కొన్నాడు. 'దృశ్యం సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతృప్తిగా ఉన్నా. మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ అరుదైన సినిమాను నటుడిగా గౌరవిస్తా' అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు.

    అన్ని భాషల్లోనూ విజయవంతం అయిన 'దృశ్యం' హిందీలోనూ విజయవంతంగా నడుస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రూ. 30.33 కోట్లు వారాంతపు వసూళ్లు సాధించింది. శ్రియా శరణ్, టబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ సాలగోంకర్ దర్శకత్వం వహించారు. వియకొమ్ 18, కుమార్ మాగ్నత్ నిర్మించారు.

    English summary
    Ajay Devgn has thanked Uttar Pradesh government and Chief Minister Akhilesh Yadav for making his latest release “Drishyam” tax-free in the state. The 46-year-old Bollywood star took to Twitter to express his gratitude. “Thanks to UP Govt and yadavakhilesh for making DrishyamTheFilm tax free. One more reason for you all to watch the film,” Devgn wrote.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X