నాగార్జున లాగే కొడుకు నాగచైతన్య కూడా బాగానే ...
తండ్రి నాగార్జున వారసత్వాన్ని నాగచైతన్య బాగానే అందిపుచ్చుకున్నాడు. తన మూడో చిత్రానికి అజయ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేయటానికి ముందుకొచ్చాడు. నాగార్జున కెరిర్ లో చాలా మంది నూతన దర్శకులకు లైఫ్ ఇచ్చి శివ, సంతోషం, మాస్ వంటి హిట్స్ సాధించాడు. అదే కోవలో వెళ్లి నాగచైతన్య తన తొలి చిత్రానికి వాసు వర్మ చేతిలో పడ్డాడు. అయితే ఆ వ్యూహం అనుకున్నంత ఫలితం కనపరచలేదు. జోష్ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే మళ్ళీ అజయ్ చెప్పిన కథ విని ఇంప్రస్ అయి కొత్త వాడైనా కాదనకుండా తన తండ్రికి రికమెండ్ చేసాడు. దాంతో ఈ చిత్రం నాగార్జున హోమ్ బ్యానర్ కామాక్షి కళా మందిర్ బ్యానర్ పై రూపొందటానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నాయి. ఇక నాగార్జున కూడా తన లేటెస్ట్ కేడీ చిత్రానికి కిరణ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తున్నాడు. అలాగే నాగచైతన్య,అజయ్ కాంబినేషన్ చిత్రం జనవరి 2010లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాగచైతన్య,గౌతం మీనన్ దర్శకత్వంలో చేస్తున్నారు. నాతో రా అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











