»   » పవన్, మహేష్‌లను వెనక్కి తోసి ఆల్టిమేట్ స్టారయ్యాడు

పవన్, మహేష్‌లను వెనక్కి తోసి ఆల్టిమేట్ స్టారయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో అజిత్ కుమార్....ఇతర టాప్ సౌతిండియన్ స్టార్స్ విజయ్, వపన్ కళ్యాణ్, మహేష్ బాబులను వెనక్కి తోసి సౌతిండియా ఆల్టిమేట్ స్టార్‌గా నిలిచాడు. ప్రముఖ బాలీవుడ్ వీడియా సంస్థ బాలీవుడ్ లైఫ్ నిర్వహించిన సర్వేలో అజిత్ కుమార్ టాప్ పొజిషన్ దక్కించుకున్నాడు.

సౌతిండియన్ ఆల్టిమేట్ స్టార్ ఎవరు? అనే అంశంపై జరిగిన ఆన్ లైన్ సర్వేలో అజిత్ 51.27% ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన తర్వాత 39.69% ఓట్లతో విజయ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. అయితే సౌతిండియాలో పాపులర్ అయిన తెలుగు స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకు ఆన్ లైన్ సర్వేలో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్ కేవలం 3.82% ఓట్లు దక్కించుకోగా, మహేష్ బాబు 1.87% ఓట్లు దక్కించుకున్నాడు.

Ajith Beats Vijay, Pawan Kalyan, Mahesh Babu

లెజెండరీ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, మళయాలం స్టార్ మమ్మూటీ, మోహన్ లాల్, కన్నడ స్టార్ పునీత్ రాజ్ , రవితేజ లాంటి వారు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే ఈ లెక్కలన్నీ కేవలం ఆన్ లైన్లో మాత్రమే నిర్వహించారు. దీన్ని బట్టి హీరోల స్థాయిని అంచనా వేయలేం అనేది మరికొందరి వాదన.

English summary
Ajith Kumar has beaten South Indian stars including Ilayathalapathy Vijay, Telugu actors Pawan Kalyan and Mahesh Babu to win the Ultimate Star of South tag.
Please Wait while comments are loading...