అజిత్ ‘డేవిడ్ బిల్లా’ సెన్సార్ టాక్
అజిత్ తాజా చిత్రం 'డేవిడ్ బిల్లా'ఈ నెల 13న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైంది. ఈ సంగతులను నిర్మాత శోభారాణి మీడియాకు తెలియచేసారు. ఆవిడ మాటల్లో..''ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకే ఒక్క డైలాగ్‌ని సెలైంట్ చేయమన్నారు. ఇంకా దేనికీ సెన్సార్‌బోర్డ్ వారు అభ్యంతరం చెప్పలేదు. సెన్సార్‌బోర్డ్ వారు ఈ చిత్రాన్ని అభినందించారు'' అన్నారు
అజిత్ హీరోగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన తమిళ చిత్రం 'బిల్లా-2'ని ఎస్వీఆర్ మీడియా ద్వారా 'డేవిడ్ బిల్లా' పేరిట తెలుగులో శోభారాణి విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు భాషల్లో 1200 ప్రింట్లతో ఈ చిత్రం విడుదల కానుంది. పార్వతి ఓమన్‌కుట్టన్, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్స్. చక్రి తోలేటి దర్శకుడు. ఈ 13న చిత్రం విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఇక ఈ చిత్రం కథ గురించి చెపుతూ... పచ్చనోటుతో ప్రపంచాన్ని శాసించొచ్చని నమ్మిన వ్యక్తి అతను. అందుకే డబ్బుపై ప్రేమ పెంచుకొన్నాడు. అందుకోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. ఇంతగా సంపాదించావ్... ఇంకా నీ ఆశ తీరలేదా? అని అడిగితే... ఇది ఆశ కాదు ఆకలి అంటూ సమాధానమిస్తాడు. ఆ ధనాకలి వెనకున్న అసలు కథేమిటో తెలియాలంటే 'డేవిడ్ బిల్లా' చూడాల్సిందే అన్నారు.
అలాగే... ఒక సాదాసీదా యువకుడు మాఫియా డాన్ బిల్లాగా ఎలా మారాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఇందులో బిల్లాగా అజిత్ చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారు. ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. శరత్ రాసిన డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయం. రాజశేఖర్ ఫొటోగ్రఫి, యువన్‌శంకర్‌రాజా ఇచ్చిన పాటలు.. ఇలా ఏ అంశం తీసుకున్నా హైలైట్‌గా నటిస్తుంది. ఇలాంటి భారీ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: యువన్‌శంకర్ రాజా.


Click it and Unblock the Notifications











