అజిత్ 'డేవిడ్‌ బిల్లా'కథేంటి?

By Srikanya

అజిత్ తాజా చిత్రం 'డేవిడ్ బిల్లా' త్వరలో తెలుగులోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథని దర్శకుడు చక్రి తోలేటి వివరిస్తూ..ఓ కుర్రాడు అనాథగా రోడ్డుపైకి వచ్చాడు. ఆకలితో అలమటించాడు. ఎవరూ ఆదరించలేదు. అంతే ఎదురు తిరిగాడు, దోచుకొన్నాడు. అప్పుడు తీరింది ఆకలి. ఆ బాటలోనే వెళ్తూ నియంతలా ఎదిగాడు. ప్రపంచాన్నే శాసించాడు. ఆ ప్రయాణంలో ఏం సాధించాడు? ఏం కోల్పోయాడో 'డేవిడ్‌ బిల్లా'లో చూడండి అన్నారు. పార్వతీ ఓమనకుట్టన్‌, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

అజిత్‌ని స్టయిలిష్‌గా ఆవిష్కరించిన చిత్రం 'బిల్లా' చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం కథ ఎలా ఉండబోతోందనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రం కథ...బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి కారణం ఏంటి? అసలు బిల్లాగా అతను ఎలా రూపొందాడు. అంత పరవ్ శక్తిగా ఎలా మారి ప్రపంచానికి సవాళ్లు విసిరాడు...వంటి అనేక విషయాలు ఈ చిత్రంలో చర్చకు రానున్నాయి. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్ లో రానుందని తెలుస్తోంది.

తెలుగులో ఈ చిత్రం ప్రదర్శన హక్కులు పొందిన శోభ మాట్లాడుతూ ''ప్రభాస్‌ నటించిన 'బిల్లా' చిత్రానికి ముందు భాగం ఈ చిత్రం. ఇందులో డేవిడ్‌ ఎవరు? అనేది కీలకం. అజిత్‌ నటన ఆకట్టుకొంటుంది. .అజిత్ కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అజిత్ రిస్కీ ఫైట్లు చేశారు. ఈ ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. 'బిల్లా'లో అజిత్ స్టయిలిష్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మరింత స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం ఉక్రెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు'' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌,
సంగీతం: యువన్‌శంకర్‌ రాజా.


అజిత్‌ నటించిన 'గ్యాంబ్లర్‌' చిత్రం ఇటీవల తెలుగులో అనువాదమైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఆ మధ్య కమలహాసన్‌, వెంకటేష్‌లు నటించిన 'ఈనాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్‌ సరసన పార్వతి ఓమనకుట్టన్‌, బ్రునా అబ్దుల్లా నాయికలుగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. వేసవి సందర్భంగా త్వరలో సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X