హైదరాబాద్ లో అజిత్ సినిమా షూటింగ్, శివ దర్శకుడు!
డైరెక్టర్ శివ మరియు హీరో అజిత్ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నాలుగోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలయ్యింది. ఈ సినిమాకు 'విశ్వాసం' అనే టైటిల్ ఖరారు చెయ్యడం జరిగింది. ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయని అజిత్, మరోసారి హిట్ కాంబినేషన్‌లో పనిచేసేందుకు రెడి అయినందుకు అభిమానులు ఆనందంగా ఉన్నారు.
డైరెక్టర్ శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో అజిత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వీరం, వేదాళం, వివేగం సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలో నటించబోయే ఇద్దరు నాయికల్లో ఒకరు కీర్తి సురేష్ అని వార్తలు వచ్చాయి. కాని అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అజిత్ ఈ షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. నయనతార, అజిత్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. డి. ఇమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











