అజిత్ తో బోని ప్లానింగ్..వదంతులు నమ్మొద్దు!
ఇటీవల మరణించిన శ్రీదేవి కుటుంబానికి తమిళ స్టార్ హీరో అజిత్ మంచి సన్నిహితుడు. ఆ అనుబంధంతోనే అజిత్ శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మూవీ ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో గెస్ట్ రోల్ ప్లే చేశాడని అంటారు. తమిళ్ లో అజిత్ స్టార్ హీరో. అజిత్ తో సినిమా నిర్మించడానికి శ్రీదేవి, బోనీ కపూర్ గతంలోనే ప్లాన్ చేసారని కానీ అనుకోని కారణాల వలన అది జరగలేదు. ఆ తరుణం ఇప్పుడు ఆసన్నమైనట్లు వార్తలు వచ్చాయి. అజిత్ తో బోనికపూర్ సినిమా నిర్మించబోతున్నట్లు జాతీయ పత్రికలో సైతం వార్తలు వచ్చాయి.
Recommended Video


ఆ వార్తలు కేవలం వదంతులు మాత్రమే అని అందులో వాస్తవం లేదని అజిత్ సన్నిహితులు తాజగా స్పందించినట్లు తెలుస్తోంది. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో విశ్వాసం చిత్రంలో నటిస్తున్నాడు. విశ్వాసం చిత్రం తరువాత అజిత్ ఏ సినిమాని ఓకే చేయలేదని అంటున్నారు. బోని కపూర్ నిర్మాణంలో సినిమా అంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదని అజిత్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











