షూటింగులో ప్రమాదం... హీరో అజిత్‌కి తీవ్రగాయాలు
యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.... యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అజిత్ ఒక కారు నుంచి మరో కారులోకి దూకే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఆయన కుడి కాలుకు తీవ్రమైన గాయం అయింది. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి షూటింగ్ నిలిపి వేసారు.
దాదాపు రెండు నెలలుగా ఈచిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగులో నయనతార, తాప్సి, ఆర్య, సుమన్ రంగనాథ్, అతుల్ కులకర్ణి, మహేష్ మంజ్రేకర్ తదితరులు పాలు పంచుకుంటున్నారు. అజిత్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగులో పాల్గొననున్నాడు.
అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.


Click it and Unblock the Notifications












