Valimai Twitter Review: హాలీవుడ్‌ రేంజ్‌లో అజిత్ వలిమై.. అదొక్కటే మైనస్.. కార్తికేయ ఎలా చేశాడంటే!

కోలీవుడ్ హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం మెచ్చే స్టార్‌గా ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు బడా హీరో అజిత్ కుమార్. విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే గొప్ప నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా హవాను చూపిస్తున్నాడు. ఆ మధ్య వరుస ఫ్లాపులను చవి చూసిన అజిత్.. 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే వెంటనే అదే దర్శకుడితో 'వలిమై' అనే సినిమా చేశాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

 ‘వలిమై' అంటూ వచ్చిన అజిత్

‘వలిమై' అంటూ వచ్చిన అజిత్

అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ తెరకెక్కించిన చిత్రమే ‘వలిమై'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్‌గా నటించాడు. హూమా ఖురేషీ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు.

అంచనాలను పెంచిన అప్‌డేట్స్

అంచనాలను పెంచిన అప్‌డేట్స్


యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘వలిమై' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

అజిత్ కుమార్‌ నటించిన ‘వలిమై' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదల అవుతుంది. దీంతో ఈ సినిమా రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా చాలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఐదు వెర్షన్లలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

వలిమై సినిమాకు అలాంటి టాక్

వలిమై సినిమాకు అలాంటి టాక్

అజిత్ కుమార్ - హెచ్ వినోథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వలిమై' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి టాక్ వచ్చింది. ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్లు వస్తున్నాయి.

 ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

‘వలిమై' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఛేజ్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్‌గా ఉందని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం యావరేజ్‌గా సాగిపోతుందని చెబుతున్నారు. ఇది చాలా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుందని సినిమాను చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇదొక్కటే సినిమాకు మైనస్ అని టాక్.

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇలా

సినిమా ప్లస్‌లు... మైనస్‌లు ఇలా

‘వలిమై' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో అజిత్ కుమార్ నటన, హీరో క్యారెక్టరైజేషన్, కార్తికేయ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, ఫస్టాఫ్, సినిమాటోగ్రఫి చాలా బాగున్నాయని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదట. కానీ, సినిమా క్లైమాక్స్‌ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని చెబుతున్నారు.

Recommended Video

Valimai : Ajith, Shalini నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు - Karthikeya | Filmibeat Telugu
 మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. అజిత్ కుమార్ నటించిన ‘వలిమై' మూవీ పూర్తిగా యాక్షన్ నేపథ్యంతో సాగే పవర్‌ఫుల్ మూవీ అని తెలిసింది. హాలీవుడ్ రేంజ్ ఛేజింగ్ సీన్లు, హీరో విలన్ మధ్య మైండ్ గేమ్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతుందట. అయితే, సెకెండాఫ్ ల్యాగ్ ఉండడంతో బోర్ ఫీలింగ్ వస్తుందట. మొత్తంగా అజిత్ ఫ్యాన్స్‌కు పండగేనట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X