Valimai పోస్టర్ లాంచ్ చేసిన నాగ చైతన్య.. విజయ్ దేవరకొండ విషెస్
అజిత్ కుమార్ హీరోగా, బోనీ కపూర్ నిర్మించిన 'వలిమై' సంక్రాంతి సందర్భంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న ఈ సినిమాకు తెలుగు హీరోలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

జనవరి 13న విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అజిత్ 'వలిమై' ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల అవుతుంది. జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా బోనీ కపూర్ నిర్మిస్తున్నఈ సినిమా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన తమిళ ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.

తమిళ్ తో పాటు హిందీ, తెలుగు
ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జనవరి 13న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ గత ఏడాది కోవిడ్ 19 కారణంగా షూటింగ్ కి గ్యాప్ వచ్చినా ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా పూర్తి చేసి జనవరి 13న ముందుగా తమిళ్ వెర్షన్ విడుదల చేద్దామని అనుకున్నామని అన్నారు. అయితే తమిళ్ వెర్షన్ మాత్రమే అనుకున్నాం కానీ తెలుగునాట సంక్రాంతి పండగకి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో గుర్తించి ఇదే సరైన సమయమని తమిళ్ తో పాటు హిందీ, తెలుగు కూడా ఒకేసారి విడుదల చేస్తున్నామని అన్నారు.

ఛేజింగ్ సీన్లు ప్రధాన ఆకర్షణ
ఇక ఈ సినిమా ఆద్యంతం అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగా గ్రాండ్ విజువల్స్ తో ఉంటుందన్న ఆయన తెలుగులో 'ఖాకి'గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా 'థీరన్ అధిగారం ఒండ్రు' సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోందన్నారు. అజిత్‌తో ఆయనకు రెండో సినిమా అని, అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారని అన్నారు. ఇక ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అన్నారు.

కార్తికేయ కీలక పాత్రలో
ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడని, అన్నారు. ఇక హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఉన్న ఇష్టంతో డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేశారని, అందువల్ల కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారని అన్నారు. అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడని అన్నారు. ఈ యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత ఆడియన్స్‌కు అర్థం అవుతుందన్నా ఆయన ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా, ఆయన తన బాడీ బిల్డ్ చేస్తున్నారని అన్నారు.
Recommended Video

అజిత్ కుమార్, కార్తికేయతో పాటు
ఇక ఈ సినిమాలో అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మకొండలతో పాటు హ్యుమా ఖురేషి, గురువాణి జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ, జి ఎం సుందర్, అచ్యుత్ కుమార్, చైత్ర రెడ్డి, తదితరులు నటిస్తున్నారని అన్నారు. ఇక యువన్ శంకర్ రాజా, జిబ్రాన్ మ్యూజిక్ అందించగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారని అన్నారు.
తెలుగు పోస్టర్ లాంచ్
ఇక సినిమా విడుదల సందర్భంగా తెలుగు పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అజిత్ కుమార్ సార్ యొక్క వలిమై యొక్క తెలుగు పోస్టర్‌ను లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, నేను చాలా పెద్ద అభిమానిని అయినందుకు మరింత ఆనందంగా ఉందని, టీమ్‌కి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ అజిత్ కుమార్ గారికి, నా సోదరుడు కార్తికేయకి మొత్తం టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని చెబుతూ తెలుగు, తమిళం మరియు హిందీలో వలిమై జనవరి 13 నుండి థియేటర్లలోకి వస్తుందని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











