twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుపర్ స్టార్ విత్ సూపర్ స్టార్.... సూపర్ కాంబినేషన్

    |

    దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత సౌత్‌లో బిగ్ బీ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్నట్టు వినికిడి. అజిత్ - అమితాబ్ కలయికలో ఇది రెండో సినిమా కావడం విశేషం. విక్రమ్, అజిత్ హీరోలుగా 1997లో తెరకెక్కిన 'ఉల్లాసం' అనే తమిళ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అమితాబ్‌కు తమిళంలో రెండో చిత్రమిది

    1997లో అజిత్‌తో 'ఉల్లాసమ్' అనే చిత్రాన్ని అమితాబ్ నిర్మించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అజిత్‌తో ఆయన సినిమా నిర్మించనుండటం విశేషం.అలాగే తమిళంలో అమితాబ్ నిర్మించే రెండో చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇటీవల విజయ్ హీరోగా 'తెరి' వంటి సూపర్ హిట్ మూవీ అందించిన అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందనే వార్త ప్రచారంలో ఉంది.

    మరోవైపు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా చెన్నై, కోడంబాక్కమ్ టాక్. అజిత్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన 'బిల్లా' ఘనవిజయం సాధించింది. రెండేళ్ల క్రితం అజిత్ హీరోగా 'ఆరంభం' అనే సూపర్ హిట్ కూడా ఇచ్చారు.విష్ణు వర్దన్-అజిత్ హిట్ కాంబినేషన్ అయినప్పటికీ విష్ణువర్దన్ గత సినిమా 'యాచ్చన్' డిజాస్టర్‌‌గా నిలిచింది.

    Ajith Kumar to team up with Big B Amitabh Bachchan in his next

    మరోవైపు మొదటి సినిమాతో ఆశలురేపిన అట్లీకి రెండో సినిమాగా విజయ్‌తో చేసిన 'తెరి' (తెలుగులో పోలీస్) పరాజయాన్ని పరిచయం చేసింది. ఈ పరిస్థితుల్లో అమితాబ్-అజిత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో మరి..? మరి.. మూడో సినిమాకి ఈ కాంబినేషన్ కుదురుతుందా? లేక అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుందా? అనేది వేచి చూడాల్సిందే. దర్శకుడు ఎవరైనా నిర్మాత అమితాబ్ బచ్చన్ కావడం ఈ ప్రాజెక్ట్ స్పెషల్. క్యా కాంబినేషన్ గురూ అనాలనిపిస్తోంది కదూ!

    విష్ణు వర్దన్-అజిత్ హిట్ కాంబినేషన్ అయినప్పటికీ విష్ణువర్దన్ గత సినిమా 'యాచ్చన్' డిజాస్టర్‌‌గా నిలిచింది. మరోవైపు మొదటి సినిమాతో ఆశలురేపిన అట్లీకి రెండో సినిమాగా విజయ్‌తో చేసిన 'తెరి' (తెలుగులో పోలీస్) పరాజయాన్ని పరిచయం చేసింది. ఈ పరిస్థితుల్లో అమితాబ్-అజిత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో మరి..?

    English summary
    News that is coming in says that Ajith may team up with Big B of Indian Cinema, the legend Amitabh Bachchan in this upcoming movie. It is not an officially confirmed reports as it is only a rumor as of now that is doing its round in Bollywood media circles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X