twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ ‘ఆరంభం’ కథ, టాక్ ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ :అజిత్‌, నయనతార జంటగా విష్ణువర్దన్‌ (పంజా డైరక్టర్) దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరంభం'. ఈ చిత్రం తమిళనాట అక్టోబరు 31న విడుదలైంది. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అవినీతి, మోసం, ప్రతీకారం ప్రధానాంశాలతో రూపొందిన ఈ చిత్రం కథ బుల్లెట్ ఫ్రూప్ జాకెట్స్ స్కామ్ ఆధారంగా రూపొందింది. రెగ్యులర్ రొటీన్ ..రివేంజ్ కాన్సెప్ట్ అయినా చెప్పిన నేరేషన్ ప్రేక్షకులను కట్టిపారేస్తోంది. అజిత్ కెరీర్ లో మరో పెద్ద ఘన విజయం సాధించిన చిత్రంగా దీన్ని చెప్తున్నారు.

    కథలో అశోక్(అజిత్),మాయ(నయనతార),అర్జున్(ఆర్య)కలిసి ఓ మిషన్ పై పనిచేస్తూంటారు. అర్జున్ ఓ కంప్యూటర్ హ్యాకర్. హై సెక్యులర్ సిస్టమ్స్ వారు హాక్ చేస్తూంటారు. ఆర్య గర్ల్ ప్రెండ్ అనిత(తాప్సి) ఓ జర్నలిస్ట్. ఆమె కూడా ఈ డ్రామా లో ఉపయోగపడుతుంది. అశోక్ ఓ లా బ్రేకర్ గా కనిపిస్తాడు. అయితే అసలు అశోక్ అలా ఎందుకు మారి...ఇతర సిస్టమ్స్ ని హ్యాక్ చేయాల్సి వచ్చింది అనేది సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్(రానా) పూర్ క్వాలిటీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ వాడటం వల్ల మరణిస్తాడు. సంజయ్ ...అశోక్ కి క్లోజ్ ప్రెండ్. తన స్నేహితుడు మరణానికి కారణమైన క్రిమినల్స్ పని పట్టడానికి ఇలా అశోక్..లా బ్రేకర్ గా మారి... యుద్దం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ ...అతను ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా... కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి అనేది మిగతా కథ.

    శ్రీ సత్యసాయి మూవీస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాద హక్కులను చండీ నిర్మాత డా.శ్రీనుబాబు.జి సొంతం చేసుకున్నారు. ఒమిక్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రియమణి ప్రధాన పాత్రలో చండీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆయన. . ప్రియమణి ప్రధాన పాత్రలో గా ఆయన నిర్మించిన 'చండీ' చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.

    ఈ సందర్భంగా డా.శ్రీనుబాబు మాట్లాడుతూ ' అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అనువాద హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కుల్ని మేం పొందాం. అజిత్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తాం. త్వరలోనే అనువాద కార్యక్రమాలు ప్రారంభిస్తాం' అని తెలిపారు.ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్, నిర్మాత: డా.శ్రీనుబాబు జి., దర్శకత్వం: విష్ణువర్థన్.

    English summary
    Arrambam is a very familiar tale of corruption, betrayal and revenge, served up with a dash of style. Vishnuvardhan has taken a leaf out of a real-life incident (the bullet-proof vest scam) and with the help of his co-writers SuBa, has spun an action thriller that, for the most parts, keeps moving at a fast clip. There is a sense of urgency in the visuals even when the events on screen are less interesting, and the cinematographer, Om Prakash, keeps the frames stylish, at times, just for the sake of it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X