వేట ప్రారంభం (‘ఆట ఆరంభం’ప్రివ్యూ)
హైదరాబాద్ : అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'ఆరంభం'. విష్ణువర్థన్ దర్శకుడు. ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఓమిక్స్ క్రియేషన్స్ పతాకంపై డా.జి.శ్రీనుబాబు 'ఆట ఆరంభం'పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు( 6 వ తేదీన) ప్రేక్షకుల ముందుకొస్తోంది.
కథలో అశోక్(అజిత్),మాయ(నయనతార),అర్జున్(ఆర్య)కలిసి ఓ మిషన్ పై పనిచేస్తూంటారు. అర్జున్ ఓ కంప్యూటర్ హ్యాకర్. హై సెక్యులర్ సిస్టమ్స్ వారు హాక్ చేస్తూంటారు. ఆర్య గర్ల్ ప్రెండ్ అనిత(తాప్సి) ఓ జర్నలిస్ట్. ఆమె కూడా ఈ డ్రామా లో ఉపయోగపడుతుంది. అశోక్ ఓ లా బ్రేకర్ గా కనిపిస్తాడు. అయితే అసలు అశోక్ అలా ఎందుకు మారి...ఇతర సిస్టమ్స్ ని హ్యాక్ చేయాల్సి వచ్చింది అనేది సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్(రానా) పూర్ క్వాలిటీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ వాడటం వల్ల మరణిస్తాడు. సంజయ్ ...అశోక్ కి క్లోజ్ ప్రెండ్. తన స్నేహితుడు మరణానికి కారణమైన క్రిమినల్స్ పని పట్టడానికి ఇలా అశోక్..లా బ్రేకర్ గా మారి... యుద్దం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ ...అతను ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా... కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి అనేది మిగతా కథ.
నిర్మాత మాట్లాడుతూ... 'తమిళంలో సరికొత్త పంథాలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ అఖండ విజయాన్ని సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మించి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ నెల 6న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అజిత్ నటన, నయన గ్లామర్, విష్ణువర్థన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకులనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.
అజిత్ హీరోగా నయనతార కాంబినేషన్ లో విష్ణువర్దన్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'ఆరంభం' కురిపించిన కాసుల వాన.. మరోమారు కోలీవుడ్ సత్తాను చాటింది. విడుదలైన పదిహేను రోజుల్లోనే రూ.113 కోట్లకు పైగా రాబట్టిందని కోలీవుడ్ వర్గాల ట్రేడ్ సమాచారం.
బ్యానర్ : ఓమిక్స్ క్రియేషన్స్
నటీనటులు : అజిత్, ఆర్య , నయనతార, తాప్సీ, దగ్గుబాటి రానా తదితరులు
సంగీతం: యువన్‌శంకర్‌రాజా,
ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్,
నిర్మాత: డా.శ్రీనుబాబు జి., స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.


Click it and Unblock the Notifications












