»   » రూ. 3 కోట్ల కారు: హీరో అజిత్ పేరుతో ఫేక్ న్యూస్ (ఫోటోస్)

రూ. 3 కోట్ల కారు: హీరో అజిత్ పేరుతో ఫేక్ న్యూస్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో అజిత్‌కు బైకులు, కార్లు రేసింగ్ అంటే మహా ఇష్టమనే సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఆయన వద్ద కొన్ని అద్భుతమైన బైక్, కార్ కలెక్షన్ ఉంది. తాజాగా అజిత్ కొత్తగా రూ. 3 కోట్ల ఖరీదు చేసే బిఎండబ్ల్యు ఐ8 కారు కొన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

2009లో కాన్సెప్టు మోడల్‌గా కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయగా....ఈ సంవత్సరం నుండి ఈ కార్లు ఇండియాలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియాలో ఈ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తి అజిత్ అంటూ ప్రచారం మొదలైంది.

ఈ సూపర్ కార్....కేవలం 0-100 km/h వేగాన్ని కేవలం 4.4 సెకన్లలోనే అందుకుంటుంది. 256 km/h గరిష్ట వేగంతో రోడ్లపై దూసుకెలుతోంది. ప్రపంచంలోని పాస్టెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెన్స్ కార్లలో ఇదీ ఒకటి. అయితే అజిత్ ఈ కారు కొన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఫోటోలు ఫేక్ అని తేల్చేసారు. అజిత్ వద్ద బిఎండబ్ల్యూ బైక్ మాత్రమే ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.

అజిత్ బిగినింగ్
  

అజిత్ బిగినింగ్

అజిత్ కు మెషీన్స్, వెహికిల్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే చిన్నతనంలో గ్యారేజీలో వివిధ రకాల ప్రయోగాలు చేసే వాడు.

అజిత్ ఫస్ట్ సూపర్ బైక్
  

అజిత్ ఫస్ట్ సూపర్ బైక్

అజిత్ కు బైక్ రేసింగులంటే కూడా చాలా ఇష్టం. గతంలో ఆయన ఫార్ములా 2 రేసర్ గా కూడా తన సత్తా చాటుకున్నారు.

అజిత్ లేటెస్ట్ బిఎండబ్ల్యూ బైక్
  

అజిత్ లేటెస్ట్ బిఎండబ్ల్యూ బైక్

అజిత్ ఆ మధ్య బిఎండబ్ల్యూ సూపర్ బైక్ కొనుగోలు చేసాడు.

సినిమాల్లో....
  

సినిమాల్లో....

అజిత్ తన సినిమాల్లో కూడా సూపర్ బైకులు నడుపుతూ కనిపించడం మనం చూడొచ్చు.

అజిత్ విత్ పాల్ రీస్
  

అజిత్ విత్ పాల్ రీస్

2010లో ఎఫ్ఐఎ ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పాల్ రీస్ అజిత్ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న దృశ్యం.

ప్రొఫెషనల్ రేస్
  

ప్రొఫెషనల్ రేస్

ఒకప్పుడు అజిత్ ప్రొఫెషనల్ ఫార్ములా 2 రేసర్. అతని కెరీర్ కార్ రేసింగుతోనే మొదలైంది. ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేసాడు.

ఎక్స్‌పర్ట్ అడ్వైజ్
  

ఎక్స్‌పర్ట్ అడ్వైజ్

ఇంటర్నేషనల్ రేసింగ్ ఏరియాలో అజిత్ పలువురికి సుపరిచితమే. ఇండియన్ రేసన్ నారాయణ్ కార్తికేయన్ తో ఫ్రెండ్షిప్ అందుకు ఓ ఉదాహరణ.

కేవలం కార్లు మాత్రమేకాదు...
  

కేవలం కార్లు మాత్రమేకాదు...

అజిత్ కేవలం కార్ రేసర్ మాత్రమే కాదు....లైసెన్డ్ రిమోట్ కంట్రోల్డ్ ప్లేన్, హెలికాప్టర్ డ్రైవర్. ఆయన తన ఖాళీ సమయంలో ఎక్కువ శాతం ఇలాంటి వాటితో ఆడుతూ గడుపుతాడు.

ఆసక్తి
  

ఆసక్తి

ఇలాంటి ఆయన సొంతగా తయారు చేయిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి అజిత్ కు ఇలాంటివి అంటే ఆసక్తి.

టేక్ ఆఫ్..
  

టేక్ ఆఫ్..

రిమోట్ కంట్రోల్డ్ ప్లేన్ నడుపుతూ అజిత్.

అజిత్ బిఎండబ్ల్యూ ఐ8
  

అజిత్ బిఎండబ్ల్యూ ఐ8

అజిత్ బిఎండబ్ల్యూ ఐ8 కారు కొన్నట్లు వచ్చిన వార్తలు, ఇంటర్నెట్లో దర్శనమిస్తున్న ఫోటోలు ఫేక్ అని తేలిపోయింది.

Read more about: ajith, అజిత్
Please Wait while comments are loading...