శ్రీదేవి కోరిక తీర్చబోతున్న అజిత్.. సంచలన దర్శకుడితో!
స్టార్ హీరో అజిత్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అజిత్ వరుస బాక్స్ ఆఫీస్ విజయాలకు వివేగం చిత్రం బ్రేక్ వేసింది. ప్రస్తుతం అజిత్ విశ్వాసం చిత్రంలో నటిస్తున్నాడు. అజిత్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. అజిత్ త్వరలో శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మాణంలో నటించబోతున్నాడనేది ఈ వార్తాళ్ సారాంశం.
శ్రీదేవి కుటుంబానికి అజిత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ లో నటించాడు. ఆ తరువాత శ్రీదేవి, బోనికపూర్ అజిత్ తో ఓ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి అకస్మాత్తుగా మరణించింది.

ప్రస్తుతం బోనికపూర్ నిర్మాణంలో అజిత్ నటించేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది విడుదలైన ఖాకీ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని యువ దర్శకుడు వినోద్ తెరకెక్కించాడు. అజిత్, బోనికపూర్ చిత్రానికి ఇతడే దర్శకుడు అని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్రం తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











