త్రిబుల్ రోల్ చేస్తున్నాడట
చెన్నై : ద్విపాత్రాభినయం హీరోలు రెగ్యులర్ చేస్తూంటారు. అయితే హీరో మూడు పాత్రల్లో కనిపించటం మాత్రం చాలా తక్కువే. ప్రస్తుతం అజిత్ అలా మూడు పాత్రల్లో కనిపించటానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన చిత్రం రూపొందుతోంది. ఇందులో అజిత్ మూడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
సక్సెస్, ఫెయిల్యూర్ లకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్ మాస్, కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరో అజిత్. ప్రస్తుతం గౌతంమీనన్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్స్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టకపోయినా.. అప్పుడప్పుడు విడుదల చేస్తున్న చిత్ర పోస్టర్లు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి.

ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో మాదిరి సాల్ట్‌పెప్పర్‌తో ఓ ఫొటో విడుదలైంది. కొన్ని రోజుల కిందట అజిత్ చాలా స్మార్ట్‌గా, యువకుడిలా నల్లజుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలై అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్ ఫొటో తాజాగా విడుదలై ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
గతంలో వచ్చిన 'దీనా' చిత్రంలో ఉన్నట్లు అజిత్ కనిపిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కాలేదన్న ఆవేదన ఆయన అభిమానుల్లో ఉన్నా.. దీపావళికి ట్రైలర్, పాటలను విడుదల చేసే అవకాశముందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











