»   » మంచు విష్ణు-రాజ్ తరుణ మూవీ ప్రారంభమైంది (ఫోటోస్)

మంచు విష్ణు-రాజ్ తరుణ మూవీ ప్రారంభమైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు, సోనారిక, రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ నటీనటులుగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నం:5 చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విష్ణుకి 'దేనికైనా రెడీ' వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

AK Entertainments Prod no 5- Manchu Vishnu - Raj Tarun Movie Opening

ఈ చిత్రాన్ని ‘ఎ టీవీ' సమర్పణలో సుంకర రాంబ్రహ్మం నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి డా.మోహన్‌బాబు క్లాప్‌నివ్వగా, ఆయన సతీమణి నిర్మల కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. మంచు మనోజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

AK Entertainments Prod no 5- Manchu Vishnu - Raj Tarun Movie Opening

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతో ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిది. సోమవారం నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు.

AK Entertainments Prod no 5- Manchu Vishnu - Raj Tarun Movie Opening

రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: నరేష్‌ కథూరియా, స్మీప్‌ కాంగ్‌, మాటలు: డైమంట్‌ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌ వర్మ, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గరికపాటి కిషోర్‌, మేకప్‌: రంగా, కాస్టూమ్స్‌: శివ-ఖాదర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రాంబాబు, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: గోపి.

English summary
The Vishnu Manchu and young hero Raj Tarun starrer yet-untitled film has been formally launched this morning. The film will be produced by AK Entertainments in the direction of G Nageshwara Reddy.
Please Wait while comments are loading...