కొడుకు కోసం పూరి జగన్నాథ్ ఖరీదైన గిఫ్టు...
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడిగా పేరొందిన దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకెలుతున్నాడు. తనదైన యాంగిల్‌లో యూత్ మెచ్చే సినిమాలు తీసే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా, కథా రచయితగా, మాటల రచయితగా పూరి జగన్నాథ్‌కు మంచి పేరుంది.
ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు పూరి. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి కావాల్సింది ముందే ఊహించి కొనిపెట్టడం పూరికి అలవాటు. తాజాగా తన కొడుకు ఆకాష్ కోసం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 6 ప్లస్‌ను కొనిచ్చాడు పూరి. ప్రస్తుతం ఈ ఫోన్ ఇండియాలో అందుబాటులో లేక పోయినప్పటికీ విదేశాల నుండి ప్రత్యేకంగా తెప్పించారు.

పూరి సినిమాల సంగతి పక్కన పెడితే.....పూరి వారసుడిగా ఇప్పటికే తెరంగ్రేటం చేసిన అతని కుమారుడు ఆకాష్ బాల నటుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఆ మధ్య వచ్చిన 'ధోని' సినిమాలో ఆకాష్ ప్రధాన పాత్ర పోషించి పెర్ఫార్మెన్స్ పరంగా విమర్శకు ప్రశంసలు అందుకున్నాడు.
తన కొడుకును పూరి భవిష్యత్ స్టార్ హీరో చేయబోతున్నారు. హీరోగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన వివిధ అంశాల్లో ఆకాష్ పూరి శిక్షణ పొందుతున్నాడు. అతన్ని త్వరలో మనం వెండితెరపై హీరోగా చూస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో వైపు ఆకాష్ కూడా ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటూ దూసుకెలుతున్నాడు.


Click it and Unblock the Notifications











