twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Hindi Closing Collections ఉత్తరాది అఖండ దారుణమైన డిజాస్టర్.. ఆ హీరో దెబ్బ గట్టిగానే కొట్టాడే?

    |

    నటసింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం హ్యాట్రిక్ విజయం అందుకొన్నది. అప్పట్లో టికెట్ రేట్ల వివాదాల మధ్య రిలీజైన ఈ సినిమా కనీస టికెట్ ధరతో భారీగా వసూళ్లను రాబట్టింది. అయితే హిందీలో జనవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

     తెలుగులో తొలి ఆట నుంచే..

    తెలుగులో తొలి ఆట నుంచే..


    అఖండ చిత్రం ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. ఏపీలో 106 కోట్ల గ్రాస్, 63 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో అఖండ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. తెలుగు వెర్షన్ కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారు 6 కోట్ల వసూళ్లు రాబట్టింది.

    20 కోట్ల లాభాలతో అఖండ

    20 కోట్ల లాభాలతో అఖండ


    అఖండ తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా కనీసం 54 కోట్ల వసూళ్ల లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల షేర్, 133 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 20 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది.

    హిందీ జనవరి 20 తేదీన రిలీజ్

    హిందీ జనవరి 20 తేదీన రిలీజ్


    అయితే అఖండ సినిమా హిందీ వెర్షన్‌ను ఎప్పుడో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సీతారామం, కార్తీకేయ2, కంతారా చిత్రాల ప్రభంజనం హిందీ మార్కెట్‌లో కొనసాగుతుండటంతో అఖండ హిందీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గతవారం ఈ సినిమాను హిందీలో ఉత్తరాది రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది.

    ఆకట్టుకోలేకపోయిన బాలయ్య

    ఆకట్టుకోలేకపోయిన బాలయ్య


    అయితే అఖండ చిత్రం హిందీ ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది. తొలి రోజు 15 లక్షలు, రెండో రోజు 25 లక్షలు, మూడో రోజు 20 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఈ సినిమా థియేటర్లలో ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఈ చిత్రం తొలి వారానికి ముందే థియేట్రికల్ రన్ ఆగిపోయింది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తంగా 70 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

     దారుణమైన నష్టాలతో అఖండ

    దారుణమైన నష్టాలతో అఖండ


    భారీ అంచనాలు, భారీ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ వర్గాలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డిస్టిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కంతార, కార్తీకేయ, సీతారామం, పుష్ప లాంటి సినిమాలకు దరిదాపుల్లో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయిందని పేర్కొంటున్నారు.

     అఖండ హిందీ ఫ్లాప్‌కు కారణం ఏమిటంటే?

    అఖండ హిందీ ఫ్లాప్‌కు కారణం ఏమిటంటే?


    ఉత్తరాది రాష్ట్రాల్లో అఖండ దారుణంగా విఫలం కావడానికి ప్రధాన కారణం.. పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడమే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అప్పటికే పఠాన్ మూవీ ఫీవర్ ప్రేక్షకులకు అంటుకొన్నది. దాంతో ఉత్తరాది ప్రేక్షకుల చూపంతా షారుక్ ఖాన్ సినిమాపై ఉంది. దాంతో అఖండ చిత్రం ప్రేక్షకులను రాబట్టలేకపోయిందనే వాదనను ట్రేడ్ వర్గాలు వినిపించాయి. ఏది ఏమైనా నందమూరి అభిమానులకు అఖండ హిందీ వెర్షన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

    English summary
    Nandamuri Balakrishna's Akhanda movie Hindi Version hits the theatres on January 20th. This movie performed disastrous show at Hindi Box office. This movie fails to atract at minimum level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X