Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దటీజ్ బాలయ్య.. అఖండతో మరో అరుదైన ఘనత.. ఎక్కడా తగ్గట్లేదుగా!
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది.. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా పూర్ణ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ పూర్తిస్థాయి నెగిటివ్ పాత్రలో నటించారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే ముందు నుంచి భారీ అంచనాలున్నాయి.
వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను రూపొందించారు. అప్పటివరకు కరోనా కారణంగా సినిమాలు విడుదల చేయాలా చేయకూడదా అని ఆలోచనలో పడిణ నిర్మాతలకు సినిమాలకు కూడా ఈ అఖండ కలెక్షన్లు ఒక రకమైన ధైర్యం ఇచ్చాయి.
కంటెంట్ ఉంటే తెలుగు సినిమాకు ఏ మాత్రం ఢోకా లేదు అని నిరూపించిన అఖండ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో అద్భుతమైన విజయాన్ని సాధించి అనేక కలెక్షన్లు సాధించింది కూడా. ఇప్పటికే ఈ సినిమా ఆన్లైన్ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అయినా సరే థియేటర్ల విషయంలో ఈ సినిమాకి అద్భుతమైన రికార్డు బద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అఖండ సినిమా ఈ మధ్య కాలంలో ఒక అరుదైన ఘనత సాధించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో దియేటర్లకు సినిమాల కోసం వెళ్ళే జనాలు పూర్తిగా తగ్గిపోయారు.

అందుకే సినిమా కలెక్షన్లు మొదటి వారం పది రోజులలో వెనక్కి వస్తే వచ్చినట్లు లేకుంటే లేదు అన్నట్లు తయారైంది పరిస్థితి. సినిమా విడుదలైన నెలరోజుల్లోపే డిజిటల్ వేదికగా కూడా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అఖండ కూడా అదే విధంగా డిజిటల్ వేదికగా అందుబాటులోకి కూడా వచ్చేసింది. అయినా సరే ఈ సినిమా థియేటర్ లో ఇంకా రన్ అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది.
అఖండ ఒక థియేటర్ లో ఏకంగా 175 రోజులు ఆడింది. గుంటూరులోని చిలకలూరి పేటలో ఉన్న రామకృష్ణ థియేటర్లో అఖండ 175 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఇది మా బాలయ్య సత్తా అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు దటీస్ బాలయ్య అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. అక్కడ 175 రోజులు పూర్తిచేసుకున్న వ్యవహారం మీద థియేటర్ యాజమాన్యం కూడా స్పందించింది. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదని కలెక్షన్లు బాగానే వస్తుండంటంతో సినిమాను థియేటర్ లో ప్రదర్శిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ విషయం గతంలోనే బోయపాటి అధికారికంగా ప్రకటించారు. ఇక బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు.