twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా కష్టపడ్డాం కానీ బాలకృష్ణ ఫోన్ కాల్ తో అంతా మారిపోయింది.. కీలక వివరాలు వెల్లడించిన అఖండ ప్రొడ్యూసర్

    |

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ రెండు లాక్‌డౌన్‌లను తట్టుకుని ఎట్టకేలకు డిసెంబర్ 2న విడుదలవుతోంది. గత ఏడాది మేలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా, మేకర్స్ తమ షూటింగ్ ప్లాన్‌లను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో వేర్వేరు ప్రదేశాలలో షూట్ చేయాల్సి వచ్చింది. అలా షూట్ కోసం రకరకాల ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు బాలకృష్ణ ఫోన్ల గురించి నిర్మాత ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

     డిసెంబర్ లో

    డిసెంబర్ లో

    నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రెండో దశ కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిపి వేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా సరే జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారు కానీ కుదరలేదు. అలా మొత్తం మీద ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అయింది.

     కీలక పాత్రలలో

    కీలక పాత్రలలో

    ఈ సినిమా ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ప్యాక్డ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని జయ జానకి నాయక సినిమా తెరకెక్కించిన మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

     జింగీ కోటలో షూటింగ్

    జింగీ కోటలో షూటింగ్

    సినిమా విడుదలకు దగ్గరవడంతో సినీ దర్శక నిర్మాతలు ప్రమోషన్స్ మంచి జోరు మీద సాగిస్తున్నారు. తాజాగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ''అరుణాచలం సమీపంలోని జింగీ కోటలో షూటింగ్ చేశాం అని అక్కడ, ఒకే రాతితో చెక్కబడిన అద్భుతమైన ఆలయం ఉందని వెల్లడించారు.,

    చాలా కష్టం అయింది

    చాలా కష్టం అయింది


    అయితే అది పురావస్తు శాఖ నియంత్రణలో ఉందన్న ఆయన దానిలో షూట్ చేసేందుకు అనుమతులు పొందడం చాలా కష్టం అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మా అదృష్టవశాత్తూ, మా షూటింగ్‌కు ఒక రోజు ముందు అప్పటి దాకా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి అయ్యారని ఆయన వెల్లడించారు.

    పర్మిషన్ దొరకక

    పర్మిషన్ దొరకక

    షూటింగ్ పర్మిషన్ దొరకక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని బాలకృష్ణ వెంటనే ఆయనకు కాల్ చేసి మాట్లాడారని, బాలకృష్ణ గారి ఫోన్ కాల్ తో మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా మాకు ఎంతగానో సహకరించి షూట్ సులభతరం చేశారని అన్నారు,

    హైలైట్‌ సీక్వెన్స్‌

    హైలైట్‌ సీక్వెన్స్‌

    ఇక సినిమాలో ఇదొక హైలైట్‌ సీక్వెన్స్‌గా ఉంటుందనీ ఆయన అన్నారు. ఇక కరోనా మహమ్మారి తర్వాత టాలీవుడ్‌లో విడుదలవుతున్న తొలి బడా స్టార్ సినిమా అఖండ. విడుదలకు పది రోజులు ఉన్నా ఓవర్సీస్ మార్కెట్లలో ఓపెనింగ్స్ సూపర్బ్ అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్‌లో బాలయ్య మార్కెట్ గనుక బలహీనంగా ఉంటే.. ఏపీ, నైజాంలోని మాస్ మార్కెట్‌లో దూసుకుపోతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

    English summary
    Akhanda Producer revealed a special phone call to central minister by balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X