Akhanda ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీ రిలీజ్ విషయంలో షాక్.. పండక్కి కాదు.. రిలీజ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ' అఖండ''. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. 'సింహా' 'లెజెండ్' తర్వాత బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీ ప్రసారం గురించి రకరకరాల చర్చలు జరుగుతుండగా దాని మీద అధికారిక ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ బొనాంజా
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన సినిమా 'అఖండ'. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రొటీన్ కథే అయినా బాలకృష్ణ గత సినిమాల కంటే ఈ సినిమాలో భిన్నంగా కనిపించడం, ఫైట్స్, బోయపాటి టేకింగ్, థమన్ మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదరడంతో 'బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.

వకీల్ సాబ్ ను
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మొదటి వారం రోజుల్లోనే రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అఖండ. అలాగే 2021లో రిలీజైన అన్ని చిత్రాల కంటే భారీ వసూళ్లను సాధించిన తెలుగు సినిమాగా కూడా రికార్డు సొంతం చేసుకొంది. ఈ సినిమా 32 రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వసూళ్లను అధిగమించింది.

రికార్డులు బద్దలు కొట్టి
ఇక బాలకృష్ణ కెరీర్ పరంగా కూడా నైజాం, ఆంధ్రాలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. వకీల్ సాబ్ సినిమా 131 కోట్ల గ్రాస్, 81.7 కోట్ల నెట్ వసూళ్లను రాబడితే.. అఖండ చిత్రం ఏకంగా 137 కోట్ల గ్రాస్, 86 కోట్ల నికర కలెక్షన్లను నమోదు చేసి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ అఖండ సినిమా అదరగొట్టింది.

వసూళ్ల వర్షం
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ - జగపతి బాబు - పూర్ణ - నితిన్ మెహతా - కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను రిస్క్ చేసి మరీ రిలీజ్ చేశామని ఈ సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఆయన అన్నట్టుగానే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
డిస్నీ+ హాట్ స్టార్ లో
సినిమా విడుదలకు ముందే అఖండ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం 20 కోట్లు చెల్లించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకరకంగా కేవలం ఓటీటీ హక్కులకు అంత భారీ వెచ్చించడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

జనవరి 21 నుండి
అయితే అఖండ OTT స్ట్రీమింగ్ పార్టనర్, డిస్నీ+ హాట్‌స్టార్ జనవరి 21 నుండి ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కోసం సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. "హాయ్! అఖండ 21 జనవరి, 2022న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేసేందుకు మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ డిస్నీ+ హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. అయితే 14న ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తుండగా మరో వారం లేట్ అవనుంది.


Click it and Unblock the Notifications











