Akhanda Trailer Review: మీరు దండం పెడుతారు.. మేము పిండం పెడుతాం.. గర్జించిన బాలకృష్ణ.. బోయపాటి దర్శక విశ్వరూపం
నందమూరి అభిమానుల ఎదురు చూపుల మధ్య బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ట్రైలర్ రిలీజైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ పవర్ ప్యాక్డ్‌గా కనిపించింది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కొట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయనే సంకేతాలను ట్రైలర్ పంపింది. అఖండ ట్రైలర్‌లో బాలకృష్ణ గర్జన ఎలా ఉందంటే..

విధి, విధాతకు సవాళ్లు విసరొద్దు..
విధి, విధాతకు సవాళ్లు విసరకూడదు అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. మేమేంటో అంచనాలు లేకుండా హమీలు ఇస్తారా? అంటూ నటుడు చెప్పిన డైలాగ్‌కు.. అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టు సీమ తూమువా? నీవు పిల్ల కాలువ అంటూ బాలయ్య తనదైన డైలాగ్స్‌తో ఇరుగ దీశాడు. వాడు నేను ఆత్మ.. వాడు నా శరీరం అంటూ ఎమోషనల్ డైలాగ్స్ కనిపించాయి.

శ్రీకాంత్ విలనిజం స్పెషల్ ఎట్రాక్షన్‌గా
ఇక శ్రీకాంత్ విలనిజం ట్రైలర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. నాకు దురద వచ్చింది. నాకు బురద అంటింది. నాకు బ్లడ్ వచ్చింది అంటూ అడ్డమైన సాకులు చెబితే అంటూ శ్రీకాంత్ వీరావేశం చూపించాడు. విలనిజానికి సరికొత్త అర్ధం చేప్పేలా కనిపించాడు. బోయపాటి మార్కు డైలాగ్స్, విలనిజం పక్కా పడిందనే విషయాన్ని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

మీరు మాట్లాడితే శబ్దం.. మేము మాట్లాడితే శాసనం
ఇక బాలకృష్ణ బిల్డప్ షాట్స్ ట్రైలర్‌లో ప్రత్యేకంగా కనిపించాయి. కళ్లు తెరిచి జూలు విదిల్చితే అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో చెప్పిన డైలాగ్స్.. బాలయ్య ఆవేశం మరో లెవెల్‌లో కనిపించాయి. ఇక నీవు మాట్లాడితే అది అంటే శబ్దం.. అదే మేము మాట్లాడితే అది శాసనం అంటూ బాలకృష్ణ చేత చెప్పించిన డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఈలల కొట్టించే విధంగా ఉన్నాయి. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే ఫైట్‌ను బోయపాటి శ్రీన్ డిజైన్ చేసినట్టు కనిపించింది.

బ్రేకుల్లేని బుల్డోజర్.. తొక్కిపారేస్తా.. నా కొడుకా
అఖండ్ ట్రైలర్‌లో బాలకృష్ణను అడ్డుకొనే సీన్‌లో.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్‌ను. తొక్కిపారేస్తా. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, ఎటు నుంచి లెక్కపెట్టినా.. నా కొడుకా ఇంచు నీ బాడీ దొరకదు, నమీకు సమస్య వస్తే దండం పెడుతారు.. మేమా సమస్యకే పిండం పెడుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ చెప్పిన డైలాగ్స్ దిమ్మతిరిగేలా ఉన్నాయి. కాంట్రాక్టులు, మైనింగ్ మాఫియాలపై బోయపాటి సంధించిన విమర్శనాస్త్రంగా అఖండ కనిపించాడు.
Recommended Video

అంచనాలు పెంచేసిన బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ సినిమా ట్రైలర్ అభిమానుల్లో ఊహించని అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద రోరింగ్ తప్పదు అంటూ ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్‌గా మారడానికి అన్ని అంశాలు కనిపించాయి. ఇక అభిమానులకు పైసా వసూల్ చిత్రమనే భావన కనిపించింది.


Click it and Unblock the Notifications











