Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: హర్షా భోగ్లే బెస్ట్ టీమిండియా టీ20 ఎలెవన్.. కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Akhanda: ఇలా చేయండి బాలకృష్ణను కలవండి.. నందమూరి ఫ్యాన్స్‌కు ఊహించని ఆఫర్
చాలా కాలంగా సరైన హిట్ లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లోనూ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ, అవేమీ ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్లను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో జతకట్టి 'అఖండ' అనే సినిమాను చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. ఇక, ఇప్పుడిది జనవరి 21 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్‌కు బాలయ్యను కలిసే ఛాన్స్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'గా బాలయ్య అరాచకం
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన సినిమానే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

యాభై రోజుల ప్రస్థానంతో రికార్డ్స్
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' మూవీ గురువారంతో యాభై రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా ఏకంగా 103 సెంటర్లలో ఈ ఫీట్‌ను సాధించింది. తద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువ థియేటర్లలో యాభై రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఈ ప్రయాణంలో హీరో బాలయ్య ఎన్నో అదిరిపోయే రికార్డులను కూడా సొంతం చేసుకుని ఔరా అనిపించారు.

ఇప్పటి వరకూ వచ్చిన లాభాలిలా
బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.58 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రూ. 20.58 కోట్లు లాభాలతో రికార్డు నమోదు చేసింది.
ముక్కు
అవినాష్‌కు
షాకిచ్చిన
ఛానెల్:
జబర్ధస్త్
మానేసి
వస్తే..
వీళ్లు
కూడా
పక్కన
పెట్టేశారంటూ!

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
'సింహా', 'లెజెండ్' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఇప్పుడు అంటే జనవరి 21 నుంచి దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు.

బాలయ్య అభిమానులకు కానుక
జనవరి 21 అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'అఖండ' మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సదరు ఓటీటీ సంస్థ నందమూరి అభిమానుల కోసం బాలయ్యను కలుసుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఎప్పుడు ఆరు అవుతుందా అని చూస్తున్నారు.
నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

ఇలా చేసి బాలయ్యను కలవండి
బాలయ్యను కలవాలనుకున్న వాళ్లు.. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకూ అఖండ మూవీని హాట్‌స్టార్‌లో చూడాలి. ఆ తర్వాత ఈ మూవీ గురించి ట్విట్టర్లో #AkhandaRoarOnHotstar అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయాలి. అలా చేసిన వాళ్లలో 500 మందిని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తారు. వాళ్లందరినీ ఒకరోజు బాలయ్య దగ్గరకు తీసుకెళ్తారు.