స్మోకింగ్ మానేశా... మా నాన్న ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు: అఖిల్ అక్కినేని
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను' సినిమాను ప్రమోట్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నాగ చైతన్య, అఖిల్ కెరీర్‌ను నాగార్జున కంట్రోల్ చేస్తున్నారనే రూమర్ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు అఖిల్ స్పందించారు. దీంతో పాటు తన స్మోకింగ్ అలవాటు, ఇతర అంశాల గురించి చెప్పుకొచ్చారు.

స్మార్ట్, హార్డ్ వర్కింగ్, కన్నింగ్ ఎవరంటే...
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్మార్ట్ ఎవరంటే ‘తారక్' అని సమాధానం చెప్పిన ఈ యంగ్ హీరో... హార్డ్ వర్క్ చేసేది ఎవరు? అంటే తన బ్రదర్ నాగ చైతన్య అని తెలిపారు. కన్నింగ్ ఎవరంటే రానా దగ్గుబాటి అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

చిరంజీవిగారే మాస్
ఇండస్ట్రీలో మాస్ ఎవరు? అంటే చిరంజీవిగారే అని, డాన్స్ పరంగా చూస్తే చరణ్ బెస్ట్ అని, హ్యాండ్సప్ హీరో అంటే మహేష్ బాబు తప్ప మరొకరి పేరు చెప్పలేమని అఖిల్ చెప్పుకొచ్చారు. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ క్రోయేషియా అని తెలిపారు.

నాన్న మమ్మల్ని ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు
నాగ చైతన్యను లవర్ బాయ్‌గా, మిమ్మల్ని మాస్ బాయ్‌గా సెటిల్ చేయాలని నాగార్జునగారు ట్రై చేస్తున్నారట నిజమేనా? అనే ప్రశ్నకు... అఖిల్ అక్కినేని స్పందిస్తూ ‘నాన్న అలా ఎప్పుడూ చేయలేదు. మాకు సలహాలు ఇస్తారు కానీ కంట్రోల్ చేయరు. నా మొదటి రెండు స్టెప్స్ వల్ల జనాలకు అలా అనిపించిందేమో' అని అఖిల్ చెప్పుకొచ్చారు.

అమ్మ సినిమాలు చాలా తక్కువ చూశాను
నాన్న సినిమాల్లో... హలో బ్రదర్ ఫేవరెట్. రొమాంటిక్ మూవీల్లో మన్మధుడు ఇష్టం. అమ్మ సినిమాలు చాలా తక్కువ చూశాను. పుష్పక విమానంలో పెర్పార్మెన్స్ నచ్చుతుందని అఖిల్ చెప్పుకొచ్చారు.

స్మోకింగ్ మానేశారా?
స్మోకింగ్ మానేశారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... అవును మానేశాను. మానేయాలని డిసైడ్ అయ్యాను. అది మంచి అలవాటు కాదు. సెట్స్‌లో స్మోక్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని అఖిల్ చెప్పుకొచ్చారు.

స్టోర్స్ స్క్రిప్టు రావడం అంత సులభం కాదు
క్రికెట్ అంటే ఇష్టం. స్టోర్ట్స్ సినిమా చేయాలని ఉంది కానీ అందుకు తగిన స్కిప్టు రావడం అంత ఈజీకాదు. ఇప్పటి వరకు వచ్చిన స్టోర్ట్స్ సినిమాల్లో ‘దంగల్' ఇష్టం. సచిన్, విరాట్... వీరిలో సచిన్ అంటే ఇష్టం. ఆయన ఎంతో మందికి స్పూర్తి. అయితే ఇపుడు చాలా విషయాల్లో కోహ్లి యువతకు స్పూర్తిగా నిలుస్తున్నారని అఖిల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











