»   » అఖిల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటో), అందులో ఏముంది

అఖిల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటో), అందులో ఏముంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని వారి ఇంట్లో త్వరలో వెడ్డింగ్ బెల్స్ మ్రోగబోతున్నాయి. అటు నాగ చైతన్యతో పాటు ఇటు అఖిల్ కూడా ప్రేమలో పడటం, తమకు కాబోయే జీవిత భాగస్వాములను వారే స్వయంగా ఎంచుకోవడం తెలిసిందే. అయితే ఈ విషయంలో అఖిల్ స్పీడుగా ఉన్నారు. ఆయన వివాహం ముందుగా జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే... అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్, డిజైనర్ శ్రేయా భోపాల్ ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. కాగా, డిసెంబర్ 9న జరగనున్న వీరి నిశ్చితార్దం జరగనుంది. ఈ కార్డ్ బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ కార్డ్ సింపుల్ గా చూడటానికి చాలా ముచ్చటగా బాగుంది.

జీవీకే హౌస్ లో అట్టహాసంగా వీరి నిశ్చితార్థం జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. స్వయంగా నాగార్జున మరియు అమల ఇప్పుడు ఈ కార్యక్రమం ఇన్విటేషన్లను అచ్చేయించారు.

ఇదిగో ఇదే ఇన్విటేషన్

ఇదిగో ఇదే ఇన్విటేషన్

హైదరాబాద్ కు చెందిన బిజినెస్ పీపుల్.. సోమనాద్రి భూపాల్ అండ్ షాలిని భూపాల్ కుమార్తె శ్రీయను తమ కొడుక్కు డిసెంబర్ 9 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నిశ్చితార్దం చేసుకుంటున్నట్లు ఈ ఇన్విటేషన్ ద్వారా వెల్లడి చేసారు. ఆ ఇన్విటేషన్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

కేవలం నాగార్జున...

కేవలం నాగార్జున...

ఓ ప్రక్క పెళ్లి ఇటలీలో ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో నిశ్చితార్థం ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కుమార్తె వారే పూర్తిగా ఈ ఏర్పాట్లు చేస్తన్నట్లు తెలుస్తోంది. నాగార్జున కేవలం అతిధులను ఆహ్వానించడంలో నిమగ్నం అయ్యారు.

పెళ్లి అక్కడ ,రిసెప్షన్ ఇక్కడ

పెళ్లి అక్కడ ,రిసెప్షన్ ఇక్కడ

వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది. నాగార్జున ఫ్యామిలీ ఇక్కడే హైదరాబాద్ లో రిసెప్షన్ ఇస్తారట. వివాహాన్ని... ఇటలీలోని రోమ్ నగరంలో ఎంతో ఘనంగా నిర్వహించాలని ఇరుకుటుంబాలు భావిస్తున్నాయి.

వైన్యూ ఫైనల్

వైన్యూ ఫైనల్

ఇటలీలోని నేపుల్స్, రోమ్ నగరాల్లో అనువైన ప్రదేశాలను వెతికి అందులో ఒక వెన్యూ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. బహుశా 2017 ప్రారంభంలో జరిగే ఈ వివాహం తెలుగు చిత్ర సీమలో చాలా కాలం పాటు మాట్లాడుకునేలా జరుగబోతోందని తెలుస్తోంది.

సెవన్ స్టార్ ఆతిద్యం

సెవన్ స్టార్ ఆతిద్యం

2017 ప్రారంభంలో జరిగే ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 800మంది అతిథులు వస్తారని తెలుస్తోంది. వారందరికి 7 స్టార్ ఆతిథ్యంతో పాటు ఇటలీలో నాలుగు రోజులపాటు ఇటలీలో ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారట.

హైదరాబాద్ లో అయితే...

హైదరాబాద్ లో అయితే...

అయితే వెన్యూ ఇంకా పూర్తి స్దాయిలో ఫిక్స్ కాలేదని, నాగార్జున...ఇక్కడ హైదరాబాద్ లో వివాహం అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కుమారుడుతోనూ, ఆడ పెళ్లివారితోనూ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

రిసెప్షన్ మాత్రం ఇక్కడే

రిసెప్షన్ మాత్రం ఇక్కడే

ఒక వేళ పెళ్లి ఇటలీలో జరిగితే మరి నాగార్జున ...ఇండస్ట్రీవారి కోసం, మరియు అభిమానుల కోసం హైదరాబాద్‌‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఎందుకంటే మీడియా, పరిచయాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి.

ఇటలీలో పెళ్లి అయితే

ఇటలీలో పెళ్లి అయితే

ఈ విషయంపై ఇప్పటికే ఇరు కుటుంబాలు చర్చల్లో నిమగ్నమయ్యారు. వచ్చే నెలలో పెళ్లి ఎక్కడ జరగనుంది అనేది ఒక కొలిక్కివస్తుందని తెలుస్తోంది. వివాహం ఇటిలీలో అయితే మీడియావారి కోసం...వీడియోలు, ఫొటోలు అందించేందుకు ఏర్పాట్లుసైతం చేస్తారట. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈ వివాహ విశేషాలు తెలియచేస్తారట.

మీడియా లీక్ ద్వారానే లవ్ మ్యాటర్

మీడియా లీక్ ద్వారానే లవ్ మ్యాటర్

అఖిల్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు శ్రీయ భూపాల్. హైదరాబాద్ కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మీడియాకు ఈ విషయం లీక్ కావడంతో అందరికీ విషయం తెలిసిపోయింది.

ఫ్యామిలీ ఫ్రెండ్ నే

ఫ్యామిలీ ఫ్రెండ్ నే

అఖిల్ చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇటీవల ఆ విషయాన్ని తన తల్లండ్రులతో చెప్పి వారికి పరిచయం చేసాడట అఖిల్.

ఇక అఖిల్ సినిమాలకు

ఇక అఖిల్ సినిమాలకు

ఈ అమ్మాయి అమెరికా న్యూయార్కులోని ‘పార్సన్స్ స్కూల్ ఆప్ డిజైన్' డిజైనింగ్ కోర్సు చేసిందట. ప్రస్తుతం ఇండియాలో డిజైనింగ్ రంగంలో తన టాలెంటును నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఇక అఖిల్ తో వివాహం అయ్యాక..భర్తకు చెందిన డ్రస్ లు అన్నీ ఆమే డిజైన్ చేస్తుందన్నమాట.

ఎంగేజ్మెంట్ విషయం ఆయనే చెప్పారు

ఎంగేజ్మెంట్ విషయం ఆయనే చెప్పారు

డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నాగార్జున స్వయంగా వెల్లడించారు. వివాహం 2017లో ఉంటుందన్నారు. మీడియావారు నాగార్జున ని నిర్మలా కాన్వెంట్ ప్రమోషన్ లో భాగంగా అడిగినప్పుడు ఈ విషయాలు వెల్లడించారు.

ఈ కపుల్ కు పెళ్లి ఎప్పుడో..

ఈ కపుల్ కు పెళ్లి ఎప్పుడో..

నాగ చైతన్య, సమంత పెళ్లి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఇద్దరూ ఎప్పుడంటే అప్పుడు తాను పెళ్లి చేయడానికి సిద్ధమని నాగార్జున స్పష్టం చేసారు. కాకపోతే ఇద్దరూ సినిమాల్లో బిజీ అవుతున్నారు. మరి ఎప్పుడు వీరి వివాహం తేది ప్రకటిస్తారో చూడాలి.

రామ్ చరణ్ వైఫ్ కు ...

రామ్ చరణ్ వైఫ్ కు ...

రీసెంట్ గా జరిగిన చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో కూడా అఖిల్, శ్రీయా భూపాల్ పాల్గొన్నారు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు శ్రీయ భూపాల్ చాలా క్లోజ్. ఆమె కోసం వెయింటింగ్ అంటూ ఉపాసన ఓ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

శ్రియ గురువు ఎవరంటే..

శ్రియ గురువు ఎవరంటే..

ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో శ్రీయా భూపాల్‌కి మంచి పట్టు ఉందట. రెండేళ్ల క్రితం 'శ్రీయా సమ్' లేబుల్ కలక్షన్ 'ఎబ్ అండ్ ఫ్లో'ని ప్రారంభించారట. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన తన తండ్రికి భావగీతం (ఓడ్)గా తన లేబుల్‌ని అంకితం చేశారని సమాచారం. కాగా, రెండు నెలల క్రితం జరిగిన 'ల్యాక్‌మి ఫ్యాషన్ వీక్'లో తొలిసారి తన కలక్షన్‌ని శ్రీయ ప్రదర్శించారు. తొలి చూపులోనే శ్రీయా భూపాల్ డిజైన్ చేసిన దుస్తులు అందర్నీ ఆకట్టుకున్నాయట. అలా ఫస్ట్ స్టెప్‌లోనే భేష్ అనిపించుకున్నారని ఫ్యాషన్ ఫీల్డ్ అంటోంది. శ్రీయ గురువు ప్రముఖ హిందీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని అట.

వీళ్లందరికి ఆమే...

వీళ్లందరికి ఆమే...

శ్రీయా భూపాల్ పలువురు హీరోయిన్స్ కు కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారని కూడా ఫిలింనగర్ టాక్. శ్రీయ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌లతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. ఇలా శ్రీయా భూపాల్ డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిన తారల జాబితా చాలానే ఉందట.

English summary
Earlier Nagarjuna said to media that his younger son Akhil engagement with Shriya Bhupal would be on December 9th. Today , Akhil’s engagement invitation card is out on social media. Check out Akhil Akkineni and Shriya Bhupal Engagement Invitation Card.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu