మ్యాడ్: అమ్మాయిల కాలేజీలో అఖిల్ (ఫోటోస్)
హైదరాబాద్: త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్...తెరంగ్రేటానికి ముందే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే యాడ్ ఫిల్మ్స్ చేయడంతో పాటు తల్లి అమలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అఖిల్. తాజాగా హైదరాబాద్ లోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో అఖిల్ సందడి చేసాడు.
మేక్ ఎ డిఫరెన్స్ (మ్యాడ్) కార్యక్రమంలో భాగంగా సెయింట్ అన్నాస్ కాలేజీలో జరిగిన వేడుకలో అఖిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలువురు అమ్మాయిలో అఖిల్ తో పోటోలు దిగడానికి పోటీ పడ్డారు.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

అఖిల్ అక్కినేని
సెయింట్ అన్నాస్ కాలేజీలో జరిగిన వేడుకలో అఖిల్ అక్కినేని.

ప్రసంగం...
మేక్ ఎ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్న అఖిల్ అక్కినేని.

బహుమతి ప్రధానం
మ్యాడ్ కార్యక్రమంలో భాగంగా ఒక అమ్మాయికి బహుమతి ప్రధానం చేస్తున్న అఖిల్.

ఉత్సాహం
అఖిల్ రాకతో సెయింట్ అన్నా కాలేజీ అమ్మాయిల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

సాదరంగా ఆహ్వానం
అఖిల్ రాక సందర్భంగా కాలేజీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అతని సాదరంగా ఆహ్వానించింది.

బెలూన్స్ ఎగరవేస్తూ..
మ్యాడ్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా బెలూన్స్ ఎగర వేస్తున్న అఖిల్.

సెల్ఫీ
పలువురు కాలేజీ అమ్మాయిలు అఖిల్ తో కలిసి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.

సందడి వాతావరణం
అఖిల్ రాకతో విద్యార్థుల్లో సందడి వాతావరణం నెలకొంది.

సోషల్ యాక్టివిటీస్
తనకు చేతనైనంత మేర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని అంటున్నాడు అఖిల్.


Click it and Unblock the Notifications











