»   »  అఖిల్ బర్త్ డే ఫోటోస్: లేట్ నైట్ పార్టీలో చై, సామ్, రకుల్, మంచు లక్ష్మి

అఖిల్ బర్త్ డే ఫోటోస్: లేట్ నైట్ పార్టీలో చై, సామ్, రకుల్, మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akhil Akkineni Birthday Party Photos Viral

అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడేళ్లయింది. ఈ మూడేళ్ల కాలంలో అఖిల్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగినట్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఈ సారి మాత్రం పార్టీ ఇరగదీశారు. హైదరాబాద్‌లో ఈ చిన్నోడి పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా జరిగింది. అందుకు కారణం 'హలో' సినిమా ద్వారా అఖిల్ తొలి విజయం అందుకోవడమే. ఏప్రిల్ 8, 1994లో జన్మించిన ఈ యంగ్ తరంగ్ 24వ వసంతంలోకి అడుగు పెట్టారు.

గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన చై-సామ్

గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన చై-సామ్

అఖిల్ పుట్టినరోజు వేడుక ఇంత గ్రాండ్‌గా జరుగడానికి కారణం సమంతే అని అంటున్నారు. చై-సామ్ పెళ్లి తర్వాత అఖిల్ జరుపుకుంటున్న తొలి బర్త్ డే. మరో వైపు ‘హలో' విజయంతో కుర్రాడు మంచి జోష్ మీద ఉన్నాడు. అందుకే ఇద్దరూ కలిసి బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.

రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి

రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి

లేట్ నైట్ వరకు జరిగిన ఈ బర్త్ డే పార్టీలో టాలీవుడ్ స్టార్స్ రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. ఇంకా ఇతర సినీ సెలబ్రిటీలు కూడా వచ్చినట్లు సమాచారం.

చైతు, సమంత

చైతు, సమంత

అఖిల్ పుట్టినరోజు వేడుకలో నాగ చైతన్య, సమంత గెస్టులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని

పుట్టినరోజు వేడుకలో తన స్నేహితుడితో కలిసి అఖిల్ అక్కినేని. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైట్ కలర్ డ్రెస్సులో అఖిల్ సూపర్బ్‌గా మెరసిపోయాడు. ప్రస్తుతం అఖిల్ ‘తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సమంత జోష్

సమంత జోష్

ఈ బర్త్ డే పార్టీలో సమంత ఫుల్ జోష్ మీద కనిపించింది. తన స్నేహితులతో కలసి ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేసింది.

యూఎస్ఏ ట్రిప్ తర్వాత మరింత ఉత్సాహం

యూఎస్ఏ ట్రిప్ తర్వాత మరింత ఉత్సాహం

సమంత, నాగ చైతన్య 2 వారాల పాటు యూఎస్ఏలో హాలిడే ఎంజాయ్ చేసి మూడు రోజుల క్రితమే ఇండియా వచ్చారు. ఈ ట్రిప్ తర్వాత ఇద్దరూ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారని అభిమానులు అంటున్నారు.

ఈ బర్త్ డే చాలా గొప్పగా జరిగిందన్న అఖిల్

ఈ సారి బర్త్ డే పార్టీ చాలా గొప్పగా జరిగిందని, తనను విష్ చేసిన, తపై ప్రేమ చూపిస్తున్న అందరికీ థాంక్స్.... అంటూ అఖిల్ ట్వీట్ చేశారు.

English summary
Akhil Akkineni birthday party photos viral in social media. "Thank you all for the love you showered on my for my birthday. I’m blessed. Had a wonderful birthday. And shall attempt to have a wonderful year ahead as well:) and now IPL time :)" Akhil tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X