అఖిల్ అక్కినేని, గీతా ఆర్ట్స్2 మూవీ మొదలైంది!

అక్కినేని స్టార్ అఖిల్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు, వాసు వర్మ నిర్మించబోతున్నారు.

సినిమా ప్రారంభోత్సవ వేడుకలో అల్లు వారి పిల్లలు సందడి చేశారు. వారి చేతుల మీదుగానే మూహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొటించారు. అల్లు అర్జున్ తనయుడు అయాన్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ వేడుకలో నాగార్జున, అమల కూడా పాల్గొన్నారు.

Akhil Akkineni, Bommarillu Bhaskar, GA2 Production no 5 launch

భాస్కర్ సినిమా అంటేనే లవ్ స్టోరీ మెయిన్ కాన్సెప్టుగా ఉంటుంది. అఖిల్‌ను గత సినిమాలకు భిన్నంగా ఒక క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రంలో ప్రజెంట్ చేయబోతున్నాడట. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె కనిపించ లేదు. ఈ విషయమై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. వి మణికందన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెుల్లడించనున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరో మరో స్టార్ ఫ్యామిలీ సినిమాలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Akhil Akkineni, Bommarillu Bhaskar, GA2 Production no 5 launch

అక్కినేని చిన్నోడు అఖిల్‌ ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. ఇపుడు మొదలైన చిత్రం అతడి కెరీర్లో నాలుగోది. మొదటి చిత్రం 'అఖిల్' దారుణమైన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X