»   »  పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నూనూగు మీసాల వయసులోనే ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు అక్కినేని చిన్నోడు అఖిల్. చిన్న వయసులో ఎంత వేగంగా పెళ్లి పీటల వైపు అఖిల్ అడుగులు వేసాడో... అంతే వేగంగా పెళ్లి పీటల వరకు వెళ్లకముందే కాబోయే భార్యతో గొడవ పెట్టుకుని పెళ్లి రద్దు చేసుకున్నాడనే వార్తలు అందరినీ షాకయ్యేలా చేసాయి.

  ఇద్దరి పెళ్లి రద్దయిందనే వార్తలు జాతీయ మీడియాలో సైతం హైలెట్ అయ్యాయి. ఇరు కుటుంబాల నుండి ఈ వార్తలపై ఎలాంటి స్పందన లేక పోవడంతో..... ఇది నిజమే అని దాదాపుగా ఖరారైంది. అయితే అఖిల్-శ్రీయ భూపాల్ పెళ్లి రద్దు కావడం ఏమిటో గానీ.... నాగ చైతన్య-సమంతకు కొత్త తలనొప్పి వచ్చిపడిందట.

  ఈ ఇద్దరూ ఎక్కడికెళ్లినా... అఖిల్-శ్రీయ భూపాల్ మధ్య ఏం గొడవ జరిగింది? ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నలు ఎదుర్కొనాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కూడా అభిమానులు వారిని ఇదే రకమైన ప్రశ్నలతో వేధిస్తున్నారట.

   పెళ్లి గురించి ఒత్తిడి

  పెళ్లి గురించి ఒత్తిడి

  అఖిల్ పెళ్లి రద్దయింది కాబట్టి.... వీరిని త్వరగా పెళ్లికి సిద్ధం కావాలని అక్కినేని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుందట. ఈ డిస్ట్రబెన్సస్ అన్నీ నాగ చైతన్య, సమంత తలనొప్పిగా ఫీలవుతున్నారని టాక్.

   గతంలో అఖిల్ వల్లే ప్రేమ వ్యవహారం బయటకు

  గతంలో అఖిల్ వల్లే ప్రేమ వ్యవహారం బయటకు

  గతంలో కూడా అఖిల్ వల్లే ప్రేమ వ్యవహారంలో నాగ చైతన్య, సమంత అనుకున్న దానికంటే ముందుగానే తన లవ్ ఎఫైర్ విషయంలో ఓపెన్ కావాల్సి వచ్చింది. అఖిల్ పెళ్లికి సిద్ధం కావడంతో సమంత-నాగ చైతన్య కూడా అనుకున్న దానికంటే ముందుగానే పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి వచ్చింది.

   మెచ్యూరిటీ లేని అఖిల్ ఆలోచనలు

  మెచ్యూరిటీ లేని అఖిల్ ఆలోచనలు

  ఈ మొత్తం వ్యవహారంలో అందరూ అఖిల్ నే తప్పు బడుతున్నారు. ఇంత చిన్న వయసులో పెళ్లి నిర్ణయం తీసుకోవడం పెద్ద తప్పు. మూతిమీద సరిగా మీసం కూడా రాని వయసులో మెచ్యూరిటిలేని ఆలోచనలతో అఖిల్ చాలా తప్పు చేసాడు.... అఖిల్ గొడవ పడే తత్వం కూడా అతడి అన్ మెచ్యూర్డ్ ఆలోచనలకు నిదర్శనమని అంటున్నారు.

   ఎయిర్ పోర్టు గొడవ

  ఎయిర్ పోర్టు గొడవ

  అఖిల్‌, శ్రీయల మధ్య హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్‌, శ్రీయ, ఆమె తల్లి బయల్దేరాట. అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకుంటున్నారు.

   అఖిల్ చేసిన పెద్ద తప్పు

  అఖిల్ చేసిన పెద్ద తప్పు

  అఖిల్, శ్రీయ భూపాల్ ఇద్దరూ ఎయిర్ పోర్టులో గొడవ పడటం....ఈ గొడవ అనంతరం శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్‌బై చెప్పేసి అఖిల్‌ ఇంటికి వెళ్లిపోవడం అతడు చేసిన పెద్ద తప్పు అని అంటున్నారు.

   పాపం నాగ్ మాత్రం ఏ చేస్తాడు?

  పాపం నాగ్ మాత్రం ఏ చేస్తాడు?

  ఈ గొడవ విషయం తెలిసి నాగార్జున ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసారట. వారిని కలిపేందుకు నాగ్‌ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసిది లేక నాగ్‌ సైలెంట్‌ అయిపోయాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

   ఇది మాత్రం నిజం అయి ఉండదు

  ఇది మాత్రం నిజం అయి ఉండదు

  ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదని, వయసులో తనకంటే పెద్ద అమ్మాయిని అఖిల్ పెళ్లాడటం కరెక్ట్‌ కాదని అఖిల్‌కు నాగ్‌ గతంలోనచ్చ చెప్పినా వినలేదని, అఖిల్‌ వినకుండా ఆమెతోనే పెళ్లి చేయాలని పట్టుపడ్డటంతో అక్కినేని కుటుంబం పెళ్లికి ఓకే చెప్పిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది నిజం అయి ఉండదని అంటున్నా కొందరు.

   పరువు గురించి ఆలోంచిన నాగ్?

  పరువు గురించి ఆలోంచిన నాగ్?

  పెళ్లి రద్దు కోవడం విషయంలో నాగార్జున చాలా ఫీలయ్యారని, వెంటనే తన పనులన్ని ప్రక్కన పెట్టిన ఆయన ...తమ రెండు కుటుంబాల పెద్దలు, అఖిల్, శ్రియ కూర్చొని మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందామని ప్రయత్నించారని. అయితే శ్రీయ భూపాల్ కుటుంబం నుండి ఎటువంటి స్పందన రాలేదని టాక్.

   డిప్రెషన్లో అఖిల్

  డిప్రెషన్లో అఖిల్

  అఖిల్ సైతం ఊహించని ఈ సంఘటనపై చాలా బాధగా ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని, బాగా సన్నిహితులు అనుకున్న స్నేహితులతో సైతం ఈ విషయం చర్చించటానికి ఇష్టపడటం లేదని సమాచారం.

   జీవికె ఫ్యామిలీ నుండి కూడా

  జీవికె ఫ్యామిలీ నుండి కూడా

  ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌తో 2016 డిసెంబర్‌లో అఖిల్‌ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తేదీ ప్రకటించకపోయినా.. ఈ వేసవిలోనే రోమ్‌(ఇటలీ)లో ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అతిథులకు టిక్కెట్లను కూడా బుక్‌ చేశారు. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అఖిల్ వివాహం జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అంతా తలక్రిందులైంది.

  English summary
  Nagarjuna’s son Akhil Akkineni’s engagement with fashion designer Shriya Bhupal has reportedly been called off months before their destination wedding in Italy. Shriya is the granddaughter of business tycoon GVK Reddy. The two had been dating for a few years and got engaged in a private ceremony in 2016 at the GVK House.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more