మొత్తానికి అయ్యగారు ఫ్యాన్ పై మొదటిసారి స్పందించిన అఖిల్.. నీకు దండం బ్రదర్ అంటూ..

ఈరోజుల్లో సోషల్ మీడియా అనగానే ఎక్కువగా అందరికీ మీమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఇక అందులో ఎక్కువగా కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఒక విధంగా వారు లేనిదే మీమర్స్ కు రోజు గడవదు అని కూడా చెప్పవచ్చు. ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ అయినా కూడా ఏదో ఒక విధంగా కొంత మంది మీమ్స్ ద్వారా హైలెట్ అవుతూ ఉంటారు. అలా పాపులర్ అయిన వారిలో అయ్యగారు అనే డైలాగ్ తో ఆకట్టుకున్న అక్కినేని వారి అభిమాని బాగా పాపులర్ అయ్యాడు. అయ్యగారు నెంబర్ వన్.. అఖిల్ వల్లే నెంబర్ వన్ సాధ్యమంటూ అప్పుడెప్పుడో హలో సినిమాతో మొదలైన అతని మాటలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఫైనల్ గా తన అభిమాని పై అక్కినేని అఖిల్ పాజిటివ్ గా స్పందించాడు.

కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా..

కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా..

ఏదైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు మొదటి రోజు వచ్చేది ఎక్కువగా డై హార్డ్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. వారి సందడి ఏ తరహాలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఎలా ఉన్నా సరే వారి సంతోషానికి అవధులు ఉండవు. ఇక కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వారి ఆనందం అకాశాన్ని దాటేస్తుంది. మీడియా ముందుకు వచ్చి చాలా సంతోషంగా గంతులు వేస్తూ ఉంటారు. అంతే కాకుండా వారి మాటలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఆ విధంగా ఎక్కువగా పాపులర్ అయిన వారిలో అక్కినేని అఖిల్ అభిమాని కూడా ఉన్నాడు.

అయ్యగారు మీమ్ నెంబర్ వన్

అయ్యగారు మీమ్ నెంబర్ వన్

అక్కినేని హీరోల సినిమాలు విడుదలైన ప్రతి సారి కూడా ఒక అయ్యగారు ఫ్యాన్ మొదటి దర్శనమిస్తారు. ఇక మీడియా ముందుకు వచ్చినప్పుడు అయ్యగారు నెంబర్ వన్ నెంబర్ వన్ అంటూ చాలా ఎనర్జీతో కనిపిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక సోషల్ మీడియా ప్రభావం వలన ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు చాలా పాపులర్ అవుతున్నారు. ఇక అయ్యగారు మీమ్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.

అయ్యగారు అభిమానిపై స్పందించిన అఖిల్

అయ్యగారు అభిమానిపై స్పందించిన అఖిల్

ఫైనల్ గా అయ్యగారు అనే అభిమాని పై కూడా అఖిల్ చాలా పాజిటివ్ గా వివరణ ఇచ్చాడు. సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడిన అఖిల్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇక ఎంతగానో పాపులర్ అయిన అయ్యగారు మీమ్ గురించి తెలుసా? అని అడగడంతో.. అఖిల్ చిరునవ్వుతో దండం పెడుతూ.. ఈ మనిషిని నేను ఎప్పుడూ కలవలేదు గాని అతను చాలా పాపులర్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువగా క్రేజ్ అందుకున్నాడు అని అది చెప్పవచ్చు అని అఖిల్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Nandamuri Babulu Lyrical Song | D/o BuchiReddy Movie
తప్పకుండా కలుస్తాను..

తప్పకుండా కలుస్తాను..

తప్పకుండా అతన్ని నేను కలవాలి అనుకుంటున్నాను. నిజంగా అయ్యగారు అనే పదం నా జీవితాన్ని టేకోవర్ చేసింది అనే చెప్పాలి. ఆ పదాన్ని మా సినిమాలో కూడా వాడడం జరిగింది. నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా ఫ్యాన్ ఎక్కువగా పాపులర్ అవ్వడం నిజంగా చాలా విశేషమని చెప్పవచ్చు. ఎలాంటి మీమ్స్ ట్రోల్స్ మొదలైన కూడా అతని డైలాగ్ ఏదో ఒక విధంగా వాడుతూనే ఉంటారు. నిజంగా మీకు దండం పెట్టాలి బ్రదర్.. నిన్ను కలవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇదే ఎనర్జీతో నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని అక్కినేని అఖిల్ గురించి పాజిటివ్ గా మాట్లాడాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X