తారక్ గారు అంటే, ఏంట్రా బలిసిందా అన్నాడు.. ఫ్యాన్స్ అలాంటి పనులు చేయొద్దు..అఖిల్!

అఖిల్ మూడవ చిత్రం మిస్టర్ మజ్ను విడుదలకు సర్వం సన్నద్ధమైంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. తొలిప్రేమ లాంటి ప్రేమకథా చిత్రంతో గత ఏడాది వెంకీ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మూడవ చిత్రం కోసం వెంకీ అట్లూరితో జత కట్టడంతో మిస్టర్ మజ్ను చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని కూడా వెంకీ అట్లూరి రొమాంటిక్ యాగిల్ లో సాగే ప్రేమ కథగానే రూపొందింస్తున్నాడు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా మిస్టర్ మజ్ను ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

మా తాతతో కూడా

మా తాతతో కూడా

మిస్టర్ మజ్ను ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడుతూ.. ప్రతి ఈవెంట్ లో అందరి గురించి మాట్లాడాలని అనుకుంటా. కానీ మరచిపోతుంటా. అందుకే ఈసారి చీటి రాసుకుని వచ్చా. ఈ చిత్రంలో కోసం పనిచేసిన మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్, డాన్స్ మాస్టర్స్ ఇలా అందరూ నాకు చాలా బాగా సహకరించారు అని అఖిల్ తెలిపాడు. ముందుగా ఈ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన మా తాతతో కూడా సినిమా చేశారు. ఆయన నిర్మాణంలో నటించడం సంతోషంగా ఉంది అని అఖిల్ తెలిపాడు.

 మూడేళ్లు నా కోసం

మూడేళ్లు నా కోసం

దర్శకుడి వెంకీ గురించి మాట్లాడుతూ.. వెంకీ ఈ చిత్ర కథని మూడేళ్ళ క్రితమే నాకు వినిపించాడు. ఒక సినిమా కోసం ఇన్ని రోజులు ఎదురు చూడడం అంటే మామూలు విషయం కాదు. అందుకు వెంకీకి కృతజ్ఞతలు చెప్పాలి అని అఖిల్ తెలిపాడు. వెంకీ గుండెల నిండా నాన్నగారిపై అభిమానం ఉంది. ఇక తమన్.. ఈ మధ్య వరుసగా హిట్స్ కొడుతున్నాడు. ఇటీవల వచ్చిన అరవింద సమేత, అంతకు ముందు వచ్చిన తొలి ప్రేమ చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు అని అఖిల్ తెలిపాడు. మిస్టర్ మజ్ను చిత్రానికి కూడా మంచి సంగీత అందించాడు.

ఆయన నిజంగానే టైగర్

ఆయన నిజంగానే టైగర్

ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ పై అఖిల్ ప్రశంసలు కురిపించాడు. నేను ఆయన్ని టైగర్ అని పిలుస్తుంటాను. ఆయన నిజంగానే టైగర్. తారక్ అన్నా ఎనర్జీని అందుకోవడం ఎవరివల్లా కాదు. నేను తారక్ గారు అని పిలిస్తే.. ఏంట్రా బలిసిందా.. నాతో ఆ ఫార్మాలిటీస్ ఏంటి అని అన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావాలని రిక్వస్ట్ చేశా. నాతో ఫార్మల్ గా ఉండకు. ఈ ఈవెంట్ కు రావడం నా భాద్యత అని ఎన్టీఆర్ అన్నట్లు అఖిల్ తెలిపాడు.

ఫ్యాన్స్ అలాంటి పనులు చేయొద్దు

ఫ్యాన్స్ అలాంటి పనులు చేయొద్దు

ఇటీవలే నాకు ఓ విషయం తెలిసిందే. అక్కినేని అభిమాని ఒకరు విజయవాడ నుంచి తిరుపతి నడచి వెళ్లారట. దయచేసి అభిమానులు అలాంటి పనులు చేయవద్దు. మీరు చూపించే ప్రేమే మాకు శక్తి. ఇలాంటి ప్రమాదకరమైన పనుల వలన మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీ కుటుంబ సభ్యులకు మీ అవసరం ఉంది అని అఖిల్ తెలిపాడు. ఈ విషయం వినగానే నాకు కంట నీరు వచ్చింది అని అఖిల్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X