Akhil – Zainab Ravdjee: అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రవ్జీ ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

Akhil - Zainab Ravdjee: అక్కినేని వారింట వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. డిసెంబర్ 6న శోభిత ధూళిపాలతో నాగచైతన్య వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంతలోనే అక్కినేని అఖిల్ నిశ్చితార్థం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో జరిగినట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. దీంతో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ అభిమానులు నెట్టింట్లో తెగ సర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం జైనబ్ రవ్జి (Zainab Ravdjee) పేరు ట్రెండింగ్ అవుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఓ లూక్కెయ్యండి.

అక్కినేని హీరో టాలీవుడ్, నటుడు అఖిల్ తన బ్యాచ్లర్ లైఫ్ కి ముగింపు పలుకబోతున్నాడు. నిన్న అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జైనబ్ రావ్డ్జీ(Zainab Ravdjee)తో ఘనంగా జరిగింది. ఈ వేడుక అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నాగార్జున ట్వీట్ చేస్తూ..
'జైనబ్ తో మా కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగిందని తెలియజేసేందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి' అంటూ నాగార్జున హిట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Akhil Akkineni gets engaged to Zainab Ravdjee who is Zainab Ravdjee What is her family background FULL Details

ఇంతకీ ఎవరీ జైనబ్..

ఢిల్లీకి చెందిన జైనబ్ (Zainab Ravdjee) థియేటర్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్ లోను ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె వేసే పెయింటింగ్స్‌కి ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాదులో కూడా ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మోడలింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రైవేట్ లైఫ్‌ని ఎక్కువగా ఇష్టపడతారట. అందుకే తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ అన్నింటిని ప్రైవేట్ లో పెట్టింది. దీన్ని బట్టే ఆమె సెలబ్రిటీ లైఫ్‌కి ఎంత దూరంగా ఉంటారో అర్థమవుతోంది.

జైనబ్ ఫ్యామిలీ విషయానికొస్తే ఆమె జుల్ఫీ రావ్‌డ్జీ (Zulfi Ravdjee)కుమార్తె. ఆయన రియల్ ఎస్టేట్ టైకూన్. నిర్మాణ పరిశ్రమలో ఆయనకు 30 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా కూడా జుల్ఫీ పనిచేశారు. Zulfi Ravdjee కుమారుడు జైన్ రవ్జీ. ఆయన కూడా వ్యాపారవేత్తే. ZR Renewable Energy Pvt Ltd సంస్థకు చైర్మన్, ఎండీగా జుల్ఫీ రవ్జీ కుమారుడు జైన్ రవ్జీ వ్యవహరిస్తున్నారు. ఇలా అఖిల్ అక్కినేని మామ గారు.. నిర్మాణ రంగంలో బడా వ్యాపారవేత్తలు.

Akhil Akkineni gets engaged to Zainab Ravdjee who is Zainab Ravdjee What is her family background FULL Details

ఇక అక్కినేని వారి కాబోయే చిన్న కోడలు జైనబ్‌కి దాదాపు రెండేళ్ల క్రితం అఖిల్‌తో పరిచయమైనట్టు తెలుస్తోంది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారికి పెద్దల అంగీకారం లభించడంతో వారి ప్రేమబంధం పెళ్లిబంధంగా మారబోతుందన్న మాట. ఇప్పటికే అఖిల్-జైనబ్ జోడీకి సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: zainab ravdjee akhil akkineni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X