గుర్రపు స్వారీతో స్పీడ్ పెంచుతున్న అఖిల్.. హిట్టు కోసం ఎంత కష్టపడుతున్నాడంటే..
అక్కినేని వారసుడు అఖిల్ వరుసగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాన్ని అందుకున్నాడు. మొదటి అడుగులోనే కెరీర్ కు గట్టి దెబ్బ పడింది. ఇక ఆ తరువాత అన్నయ్య తరహాలో లవ్ స్టోరీస్ తో సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు అతనికి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హిట్ అందుకునే అవకాశం దొరికింది. సురేందర్ రెడ్డి లాంటి మాస్ కమర్షియల్ దర్శకుడు హీరోలను ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
కిక్కు, రేసుగుర్రం, ధృవ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిన సురేందర్ రెడ్డి గత ఏడాది సైరా సినిమాతో ఒక విధంగా పరవలేదనిపించాడు. అయితే ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ తో మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇక అఖిల్ దర్శకుడి సినిమా కోసం గుఱ్ఱపు స్వారీ కూడా అలవాటు పడుతున్నాడు. అతనికి పర్సనల్ గా గిజెల్లే అనే పెంపుడు గుర్రం కూడా ఉంది. ఇటీవల ప్రాక్టీస్ సెషన్ కి సంబంధించిన ఒక వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

చూస్తుంటే డైరెక్టర్ రేసుగుర్రం ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. మెగాస్టార్ తో సినిమా చేసిన తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో స్టార్ హీరోతో సినిమా చేస్తాడని అంతా బావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా అఖిల్ ను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అఖిల్ మార్కెట్ కు మించి అత్యదిక బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











