Akhil Akkineni: అక్కడ నాగార్జున కొడుకు అనరు.. అమల కొడుకనే అంటారు.. అఖిల్ ఆసక్తిర వ్యాఖ్యలు
సిసీంద్రి సినిమాతో చిన్నప్పుడే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు అక్కినేని అఖిల్. టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున- అమల ముద్దుల తనయుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అఖిల్. మనం సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చి.. అఖిల్ మూవీతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అయితే ఆ మూవీ అనుకున్నంతగా హిట్ కాలేదు. హలో, మిస్టర్ మజ్ను ఇవేవి అంత పేరు తీసుకురాలేదు. ఇటీవల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీతో హిట్ ట్రాక్‌లో పడ్డాడు అఖిల్. ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు అఖిల్. ఇదిలా ఉంటే తాజాగా తనను అక్కడ అమల కొడుకనే అంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రాని గుర్తింపు..
సిసీంద్రిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్కినేని అఖిల్.. హీరోగా మాత్రం అంతగా గుర్తింపు పొందలేకపోయాడు. కానీ ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీతో ఫస్ట్ టైమ్ హిట్ ట్రాక్‌లో పడ్డాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్‌గా రానున్నాడు అఖిల్.

టైమ్ ట్రావెల్ చిత్రం..
ఇదిలా ఉంటే యంగ్ హీరో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీలో అక్కినేని అమల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్‌కు తల్లిగా అమల నటించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తి రేకేత్తించేలా ఉంది.

జోరుగా ప్రమోషన్స్..
శర్వానంద్ 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలనే నెలకొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగానే తాజాగా 'అమ్మచేతి' వంట అనే చిట్‌చాట్‌ను రూపొందించారు. ఇందులో అమల, శర్వానంద్‌తోపాటు అఖిల్ కూడా పాల్గొన్నాడు. ఇందులోనే అఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ప్రభాస్ వదిలిపెట్టడు..
'చెన్నైకు వెళ్తే నన్ను నాగార్జున కొడుకు అనరు. అమల కొడుకనే అంటారు. అక్కడికి వెళ్తే అంతా అమ్మ గురించే అడుగుతారు. నాకు, నాన్నకు మధ్య ఫైటింగ్ వస్తే మా అమ్మే ఆపుతుంది' అని తెలిపాడు అఖిల్. అలాగే ప్రభాస్ గురించి చెబుతూ 'ఎవరైనా ప్రభాస్‌ను కలిస్తే జాగ్రత్తగా ఉండాలి. ప్రభాస్ ఫూడీ. ఇక చాలు తినలేను అని చెప్పినా ప్రభాస్ వదిలిపెట్టడు' అని చెప్పుకొచ్చాడు అక్కినేని అఖిల్.
మనసుకు హత్తుకుంది..
ఇక ఒకే ఒక జీవితం విషయానికొస్తే.. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ కథ తన మనసుకు హత్తుకుందని అక్కినేని అమల తెలిపారు. శర్వానంద్ తనకు మూడో కొడుకుగా మారాడాని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











