'ఇన్‌స్టాగ్రామ్' లో అక్కినేని అఖిల్ (కొత్త ఫొటోలు)
హైదరాబాద్: 'అఖిల్' చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న అక్కినేని అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అభిమానులకు అందుబాటులో ఉంటున్న అఖిల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అభిమానులను అలరించనున్నారు. ఆయన కొత్త ఫొటోలు, విలువైన సమచారం ఇందులో దొరుకుతుంది.
ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు అభిమానులకు ఆసక్తి కల్గించేలా పోస్టులు చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇప్పటి వరకు అఖిల్‌ను ట్విట్టర్లో దాదాపు 5 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో దాదాపు 9 లక్షల మంది ఫాలొఅవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కినేని అఖిల్ ఐడి ఇది...
అఖిల్ తాజా చిత్రం విషయానికి వస్తే....
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న 'అఖిల్' చిత్రం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే ఈ టీజర్ 5 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ మేరకు నితిన్ చాలా ఆనందంగా ఉన్నాడు.
అలాగే ఈ టీజర్ కు అంతటా మంచి అప్లాజ్ వచ్చింది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. ఈ టీజర్ ని ఇక్కడ చూడవచ్చు.
'అఖిల్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రం యూనిట్ గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. మరో యువ హీరో నితిన్ తండ్రిసుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు ..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు.
ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు, ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే ఇటీవల థాయ్ లాండ్ కు ప్రయాణం అయిన అఖిల్ త్వరలోనే వీడియో ఒకటి విడుదల చేస్తానంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. అఖిల్ ఇచ్చిన మాటను చిత్ర నిర్మాత నితిన్ నిలబెట్టుకుంటూ మేకింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అధికారికంగా చిత్ర నిర్మాత నితిన్ విడుదల చేసిన వీడియోతో ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమైంది! స్పెయిన్ వీధుల్లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ లో అఖిల్... ఎంతో రిస్క్ తీసుకుని నటించాడు. అంతేకాదు... ఇటు యూనిట్ సభ్యులతో పాటు... అటు దర్శకుడు వీవీ వినాయక్ తోనూ సూపర్ అనిపించుకున్నాడు.
యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.
శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











