అమ్మ కోసం...అక్కినేని అఖిల్ ఫోటో షూట్ (పిక్చర్స్)
హైదరాబాద్: అక్కినేని అమల బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతూ రోడ్డున పడ్డ మూగ జీవాలకు సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీధుల్లో తిరుగుతూ ప్రమాదాల బారిన పడే కుక్కులను దత్తత తీసుకోవాలని, వాటికి ఆశ్రయం కల్పించాలని, మూగ జీవాల పట్ల మానవత్వం చాటు కోవాలనే ప్రచారాన్ని ఆమె విస్త్రతంగా చేస్తున్నారు.
అమల చేస్తున్న ఈ జంతు సేవ కార్యక్రమాలకు త్రిష, అనుష్క మరికొందరు హీరోయిన్ల కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ లిస్టులో అక్కినేని అఖిల్ కూడా చేరాడు. అమ్మ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం కుక్కలతో కలిసి ఫోటో షూట్లో పాల్గొన్నాడు. ‘మై డాగ్ ఈజ్ ఏ రెస్క్యూ' అనే టీషర్టు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, అఖిల్ హీరోగా పరిచయం అయ్యే సినిమా వివరాలు...

హీరోగా పరిచయం
అఖిల్ అక్కినేని త్వరలో హీరోగా తెరం గ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే.

మనం
ఇటీవల విడుదలైన 'మనం' చిత్రంలో అఖిల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడంతో అతని తొలి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో అఖిల్ లుక్ అదరిపోయే విధంగా ఉండటమే ఇందుకు కారణం.

తొలి సినిమాపై స్పెషల్ కేర్
ఏ హీరోకైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇప్రెషన్. తొలి సినిమా హిట్టయితేనే...ఫ్యూచర్ బాగుంటుంది. లేకుంటే కెరీర్ స్లోగా నడుస్తోంది. నాగార్జున పెద్ద కూమారుడు నాగ చైతన్య నటించిన తొలి చిత్రం 'జోష్' ఆశించిన ఫలితా ఇవ్వకపోవడంతో నాగ చైతన్య కెరీర్ ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. నాగ చైతన్యకి లక్కీగా 'ఏమాయ చేసావే' హిట్ వచ్చింది కాబట్టి క్లిక్ అయ్యాడు.

హిట్ ఇచ్చే దర్శకుడి కోసం...
పెద్ద కుమారుడు నాగ చైతన్య విషయంలో జరిగిన తప్పులు....అఖిల్ విషయంలో జరుగకూడదని నాగార్జున భావిస్తున్నాడు. ఇందుకోసం అఖిల్ తొలి సినిమా కోసం పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జునే నిర్మించబోతున్నారు. అందుకే హిట్ ఇచ్చే సత్తా ఉన్న దర్శకుడితోనే అఖిల్ సినిమా చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











