Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఖిల్ అక్కినేని న్యూ స్టైలిష్ లుక్.. బాక్సాఫీస్ హిట్టు కొట్టేలా ఉన్నాడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు కోసం కష్టపడుతున్న హీరోల లిస్టు పెద్దాగానే ఉంది. ఇక అందులో అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు. నెక్ట్స్ ఈ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారిగానే ఉన్నాయి. ఇక అఖిల్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మొదటి మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో నాలుగవ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నాడు. అయితే అఖిల్ 5వ సినిమాతో మాత్రం అంతకు మించి అనేలా టార్గెట్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ఏజెంట్ టైటిల్ పై ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సినిమా ఫస్ట్ లుక్ కు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అదే విదంగా మరో లుక్ ను కూడా ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ స్టైలిష్ లుక్కుతో అఖిల్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఏ రేంజ్ లో హిట్టు కొడతాడో తెలియదు గాని ఏజెంట్ సినిమాతో మాత్రం పవర్ఫుల్ హిట్టు కొట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో యాక్షన్ విజువల్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయట. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.