అఖిల్ చిలిపి పని : క్రిస్ గేల్ బాదడంపై బ్రహ్మీ ఫైర్
హైదరాబాద్ : ఐపీఎల్ -6 టోర్నీలో ఇటీవల బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు క్రిస్ గేల్ పూణె వారియర్స్‌పై భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడంతో పాటు 66 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు గేల్.
ఈ నేపథ్యంలో నాగార్జున తనయుడు అఖిల్ తన ట్విట్టర్ పేజీలో ఓ చిలిపి పోస్ట్ చేసాడు. దూకుడు సినిమా క్లైమాక్స్ లో కమెడియన్ బ్రహ్మానందం విలన్ సోనూ సూద్ పై వాడే డైలాగును ఇప్పుడు గేల్ పైకి అనువదించి ఫన్నీ కమెంట్‌తో కూడిన పోస్టు చేసాడు. ఇప్పుడు ఇది సోషల్ నెట్వర్కింగ్ లో ఇపుడు అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది.
'నువ్వు మనిషివా పశువ్వా...అలా కొడతావేంటి...బాల్ పోతే ఎవరిది రెస్పాన్స్ బులిటీ...నువ్వొక్కడివే ఏదో ఐపీఎల్ టీంలా ఫీల్ అవుతావేంటి....ఐపీఎల్ టీంలో ఒక ప్లేయర్‌వి అంతే నువ్వు' అంటూ గేల్ పై బ్రహ్మీ ఫైర్ అయినట్లు ఆ పోస్టు సారాశం. అయితే ఇది కేవలం సరదాకి చేసిన పని మాత్రమే. గేల్ అభిమానులో, బ్రహ్మీ అభిమానులో ఫీల్ కావొద్దు సుమీ.


Click it and Unblock the Notifications












