twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేము కాపీకొట్టలేదు: హలో కాపీ వివాదంపై అక్కినేని అఖిల్ స్పందన

    |

    Recommended Video

    Akhil Clarifies About Hello Teaser Copyright Claim మేము కాపీకొట్టలేదు !

    ఈ మధ్య కాలంలో సినిమా రంగాన్ని పైరసీ, లీకేజ్ లతోపాటు కాపీ అనే పదం కూడా తెగ వేదిస్తుంది. సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన, లేదంటే ఏదైన కాన్సెప్ట్ కి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేసిన వెంటనే ఇది హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతుంటారు. అయితే ఇప్పుడు కాపీ కారణంగా అఖిల్ సినిమా టీజర్ యూ ట్యూబ్ నుండే ఎగిరిపోయింది.

     అన్నపూర్ణ స్టూడియోస్

    అన్నపూర్ణ స్టూడియోస్

    సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు 'హలో' డిజటాల్ రైట్స్ ను వేరెవరికైనా అమ్మేస్తే.. అప్పుడు సదరు వీడియో పబ్లిషింగ్ రైట్ లేని వాళ్ల ఛానల్స్ నుండి వీడియో తొలగించబడుతుంది. కాని అన్నపూర్ణ స్టూడియో వారి సొంత చిత్రమైన ఈ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్ వేరేవారికి ఇచ్చే ఛాన్సు ఉండదు.

     'ఎపిక్ నార్త్

    'ఎపిక్ నార్త్

    కాని ఇక్కడ విషయం ఏంటంటే.. అసలు హలో టీజర్ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు అనుకుంటున్న మ్యూజిక్ అతనిది కాదట. ఫిన్ ల్యాండ్ కు చెందిన 'ఎపిక్ నార్త్' అనే ఒక కంపెనీ.. టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారుచేస్తుంది. వారు ఎంతో క్వాలిటీగా కంపోజ్ చేసి తయారుచేసే మ్యూజిక్ మనం కొనుక్కోవచ్చు.

    కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా

    కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా

    అలా కంపోజ్ చేసిన 'ఎక్సోసూట్' అనే మ్యూజిక్ ను.. యాజిటీజ్ హలో కోసం వాడేసుకున్నారు. కాని కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా వాడుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే కాపీ రైట్ క్లయిమ్ వేయడంతో.. యుట్యూబ్ లో హలో టీజర్ ఎగిరిపోయింది.

     ట్విట్టర్ లో ఓ పోస్టింగ్

    ట్విట్టర్ లో ఓ పోస్టింగ్

    అయితే దీనిపై ఆ సినిమా హీరో అఖిల్ మాత్రం అలాంటిదేం లేదని అంటున్నాడు. హలో టీజర్ పై ఫాల్స్ కాపీ రైట్ క్లెయిమ్ చేశారంటూ ట్విట్టర్ లో ఓ పోస్టింగ్ పెట్టాడు. హలో సినిమా రూపొందింది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే. సినిమా నిర్మాతలుగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నామని ఆ పోస్టింగులో పెట్టాడు.

    అనవసరమైన గలాటా

    అనవసరమైన గలాటా

    ఈ టీజర్ మ్యూజిక్ కు సంబంధించి రియల్లీ స్లో మోషన్ తో తాము కొలాబరేషన్ పెట్టుకున్నామని అంటున్నాడు. సరైన కారణం లేకుండా అనవసరమైన గలాటా సృష్టిస్తున్నారంటూ ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కినేని ఫ్యామిలీ కలకాలం గుర్తుంచుకోదగిన హిట్ అందించిన మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ హలో సినిమాను డైరెక్ట్ చేశాడు.

     అఖిల్ క్లారిటీ

    అఖిల్ క్లారిటీ

    మనం సినిమాకు మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు పని చేశాడు. అవ్వాల్సిన రభస అంతా అయ్యాక టీజర్ మ్యూజిక్ చౌర్యం చేసింది కాదని ఇప్పుడు అఖిల్ క్లారిటీ ఇస్తున్నా అభిమానులు మాత్రం ఈ సంగతి పక్కనెట్టి కాస్త పాటల రిలీజ్ పని చూడమంటూ సలహాలిస్తున్నారు.

    English summary
    "8 million and counting on social media💪🏻 As producers of the film we have to clarify the false copyright claim on our teaser. We are proud to have collaborated with really slow motion for an amazing background score. Pheww! What havoc for no reason" Tweets Akhil Akkineni
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X