»   » అఖిల్ అక్కినేని ప్రేమించిన అమ్మాయి ఈవిడేనా?, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? (ఫోటోస్)

అఖిల్ అక్కినేని ప్రేమించిన అమ్మాయి ఈవిడేనా?, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాను ప్రేమలో పడ్డట్లు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొంత కాలంగా ఫ్రెండ్స్ సర్కిల్, ఇండస్ట్రీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపనట్లు ప్రచారం మొదలవ్వడంతో అఖిల్ స్పందించారు.

'నిజమే...నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అయితే ఎంగేజ్ మెంట్ మాత్రం కాలేదు, కేవలం మా తల్లి తండ్రలుకు పరిచయం చేసాను' అని తేల్చి చెప్పేశారు అఖిల్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అని ప్రశ్నిస్తే.. పేరు, ఇతర వివరాలు మాత్రం ఇప్పుడే చెప్పను అంటూ తప్పించుకున్నాడు.

అయితే ఇలాంటి విషయాలు ఎంత దాచాలని ప్రయత్నించినా....ఏదో ఒక రకంగా బయటకు లీక్ అవుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్ సర్కిల్ వల్లనో, రిలేషన్ సర్కిల్ వల్లనో ఏదో ఒక రకంగా విషయం బయటకు పొక్కేస్తుంది. తాజాగా అఖిల్ విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది.

అఖిల్ గర్ల్ ఫ్రెండ్ పేరు, ఆమె ఎక్కడ చదువుకుందనే విషయాలతో ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కు సంబంధించిన డీటేల్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇది అఫీషియల్ సమాచారం మాత్రం కాదు. అఖిల్ సన్నిహిత వర్గాల్లో జరుగుతున్న టాక్.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన విషయాలు....

ఈవిడేనా?

ఈవిడేనా?

అఖిల్ ప్రేమించిన అమ్మాయి పేరు శ్రీయ భూపాల్ అని ప్రచారం జరుగుతోంది.

ఎవరి కూతురు?

ఎవరి కూతురు?

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శాలిని భూపాల్ కూతురు అని అంటున్నారు.

ఏం చదువుకుంది?

ఏం చదువుకుంది?

ఈ అమ్మాయి అమెరికా న్యూయార్కులోని ‘పార్సన్స్ స్కూల్ ఆప్ డిజైన్' డిజైనింగ్ కోర్సు చేసిందట.

ఫ్యామిలీ ఫ్రెండ్రే

ఫ్యామిలీ ఫ్రెండ్రే

ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇటీవల ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి వారికి పరిచయం చేసాడట అఖిల్.

నాగ చైతన్య పెళ్లి తర్వాతే

నాగ చైతన్య పెళ్లి తర్వాతే

నాగ చైతన్య పెళ్లి సెట్టయిన తర్వాతే అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాలనుకున్నాడు. కానీ విషయం ఆల్రెడీ లీక్ అయిపోయింది.

చైతూ-సమంత

చైతూ-సమంత

నాగ చైతన్య హీరోయిన్ సమంతతో ప్రేమాయణం నడుపుతున్నాడని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కూడా అఫీషియల్ గా వెల్లడి కావాల్సి ఉంది.

English summary
As per the latest reports, the girl Akhil is rumoured to be seeing is the Hyderabad-based designer Shriya Bhupal, daughter of city based industrialist Shalini Bhupal. In fact, parents of Akhil and Shriya were reportedly informed about their relationship and the couple got the nod from both the families.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu