మిస్టర్ మజ్ను టీజర్: చాక్లెట్స్ సరిపోవు.. ఆ టచ్ కావాలి.. అఖిల్ అదరగొట్టేశాడబ్బా!
అక్కినేని యువ వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ ఈ చిత్రంలో లవర్ బాయ్‌గా, అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియోలా కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్ నిఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. తాజాగా మిస్టర్ మజ్ను చిత్ర టీజర్ విడుదలైంది. ఇది అక్కినేని ఫాన్స్ పండగ చేసుకునే టీజర్ అని చెప్పొచ్చు. మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. టీజర్‌లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం!

రాత్రి 11:30కి ఎం చేస్తున్నావ్
బ్యాగ్రౌండ్ లో నుంచి ఆసక్తికరమైన డైలాగ్ వినిపిస్తుండగా అఖిల్ కారులో ఎంట్రీ ఇస్తాడు. డీన్ ఇంట్లో మార్గ్రేట్ రూమ్ లో రాత్రి 11.30 గంటలకు ఎం చేస్తున్నావ్ అని అఖిల్ ని వాళ్ళ యంగ్ అండ్ బ్యూటిఫుల్ ప్రొఫెసర్ అడుగుతుంది. మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు మీరేం చేసేవారు అని అఖిల్ అడుగుతాడు. దానికి వాళ్ళ ప్రొఫెసర్ చాక్లెట్స్ తినేదాన్ని అని సమాధానం ఇస్తుంది. ఆ రోజుల్లో చాక్లెట్స్ తో పని అయిపోయేది. కానీ ఇప్పుడున్న ఒత్తిడికి హ్యూమన్ టచ్ కావాలి అని అఖిల్ అంటాడు.

రొమాంటిక్ యాంగిల్
అక్కడి నుంచి అఖిల్ లోని రొంటిక్ యాంగిల్ బయట అపడుతుంది. అందమైన యువతులతో అఖిల్ రొమాన్స్ ని కొన్ని క్షణాల పాటు టీజర్ లో చూపించారు. ఆ సమయంలోనే హీరోయిన్ నిధి అగర్వాల్ , అఖిల్ కు పరిచయం అవుతుంది. అఖిల్ రొమాంటిక్ వేషాలు గమనించిందో ఏమో కానీ.. తన స్నేహితురాలు క్రేజీ క్యారెక్టర్ కదా అని అఖిల్ ని పొగిడితే.. కాదు డేంజరస్ క్యారెక్టర్ అని సమాధానం ఇస్తుంది.
యాక్షన్ యాంగిల్
అఖిల్ కోసం వెంకీ అట్లూరి ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా రూపొందించినట్లు ఉన్నాడు. స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రఫీతో రూపొందించిన ఫైట్ సీన్ ని టీజర్ లో చూపించారు. అఖిల్ ఈ చిత్రంలో డాన్స్ కూడా అదరగొట్టినట్లు కనిపిస్తున్నాడు. చివర్లో అఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు నా కోసమే పుట్టలేదు. వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది అనే డైలాగ్ బావుంది.

జనవరి 25న విడుదల
ఈ నెల 25న మిస్టర్ మజ్ను చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అఖిల్ అదరగొట్టేశాడు. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి ప్రేము పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ లవర్ బాయ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రం ఉండబోతోంది. నిధి అగర్వాల్ అఖిల్‌కు జోడిగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











