ట్విటర్ రివ్యూ: 'మిస్టర్ మజ్ను'గా అఖిల్.. అక్కినేని వారసుడికి హిట్ పడ్డట్లేనా!

Recommended Video

Mr Majnu Premier Show Talk From Audience | Filmibeat Telugu

అఖిల్ అక్కినేని కెరీర్ లో తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు అఖిల్, హలో నిరాశపరిచాయి. అఖిల్ తన బాడీ లాంగ్వేజ్, లుక్ మార్చుకుని మూడవ చిత్రం మిస్టర్ మజ్నులో నటించాడు. యువదర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. అఖిల్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది. ట్రైలర్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మిస్టర్ మజ్ను చిత్రం పాజిటివ్ బజ్ తో నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ హాఫ్ బావుంది

మిస్టర్ మజ్ను చిత్ర ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ఓవరాల్ సినిమా గురించి చెప్పాలంటే అబౌ యావరేజ్.

ప్రాణం పోశాడు

మిస్టర్ మజ్ను చిత్రంతో అఖిల్ హిట్ కొట్టాడు. తొలి ప్రేమ తర్వాత వెంకీ అట్లూరి మరో హిట్. తమన్ తన సంగీతంతో చిత్రానికి ప్రాణం పోశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. తమన్ అన్న ఈజ్ బ్యాక్..

ఆ రెండూ కలగలిపి

మిస్టర్ మజ్ను చిత్ర ఫస్ట్ హాఫ్ హలా బావుంది. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ కలగలిపి ఉంది. అఖిల్ కు ఈ చిత్రంతో విజయం దక్కింది.

తండ్రికి పోటీ ఇచ్చే కొడుకు

కంగ్రాట్స్ అఖిల్ అన్న.. మిస్టర్ మజ్నుతో హిట్ కొట్టేశాం. తాతకు తగ్గ మనవడు.. తండ్రికి పోటీ ఇచ్చే కొడుకు అఖిల్.

అఖిల్‌లో చాలా మార్పు

మిస్టర్ మజ్ను చిత్రంతో అఖిల్ లో చాలా మార్పు కనిపించింది. బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ చిత్రం కోసం తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నిధి అగర్వాల్ నిక్కీగా పర్వాలేదనిపించింది. విక్కీ, నిక్కీ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాకపోవచ్చు. చాలా మంది ఈ కథతో కనెక్ట్ కావడం కష్టం. తమన్ సంగీతం బావుంది.

అంతా నిధి అగర్వాల్ గురించే

మిస్టర్ మజ్ను చిత్రం సూపర్ హిట్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటోంది. కంగ్రాట్స్ నిధి అగర్వాల్. అందరూ నీ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. నిధి అగర్వాల్ లుక్స్ చాలా బావున్నాయి. నిక్కీగా నిధి అగర్వాల్ ఉత్తమ నటన కనబరిచింది.

అఖిల్‌పైనే ఆశలన్నీ

మిస్టర్ మజ్ను ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఫైట్ సీన్ కేకపెట్టించే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బావుంది. అక్కినేని వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఆశలన్నీ అఖిల్ పైనే ఉన్నాయి. అఖిల్ స్టార్ మెటీరియల్.

డైలాగ్స్ అదుర్స్

ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఎట్టకేలకు అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రంతో హిట్ అందుకున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించారు.

ఫస్ట్ బ్లాక్ బస్టర్

ఫస్ట్ 20 నిమిషాలు చిత్రం రచ్చ రచ్చగా ఉందట. ఇంకా ఈ ఫైట్ సన్నివేశం ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా ఉందట. కంగ్రాట్స్ అఖిల్ బ్రో.. తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నావు. తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్తు అఖిల్.

ఫస్ట్ హాఫ్ మొత్తం అఖిలే

ఫస్ట్ హాఫ్ మొత్తం అఖిల్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో డామినేట్ చేశాడు. యువతకు నాచే తాజా అంశాలు ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ ని దర్శకుడు ఎమోషనల్ టచ్ తో నడిపించాడు. మొత్తంగా అఖిల్ ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X