అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం అదిరిపోయే టైటిల్.. మ్యాజిక్ చేయబోతున్న తొలిప్రేమ దర్శకుడు!

అఖిల్ అక్కినేని మూడవ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు నిరాశపరిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్, ఆ తరువాత ప్రేమ కథగా వచ్చిన హలో చిత్రం నిరాశపరిచాయి. దీనితో మూడవ చిత్ర ప్లానింగ్ విషయంలో అఖిల్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది. ఓ ఆసక్తికరమైన టైటిల్ ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కు సంబందించిన వివరాలు కూడా అఖిల్ మూడవ చిత్ర విషయంలో ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి.

Recommended Video

Officer Pre Release Event : Akhil, Naga Chaitanya Speech
తొలి చిత్రంతోనే సూపర్ హిట్

తొలి చిత్రంతోనే సూపర్ హిట్

దర్శకుడు వెంకీ అట్లూరి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు తొలిప్రేమ చిత్రాన్ని ఈ దర్శకుడు అందమైన ప్రేమ కథగా మలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈ దర్శకుడిపై నమ్మకం ఉంచాడు.

ఎక్కువభాగం అక్కడే

ఎక్కువభాగం అక్కడే

ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. కథకు అనుగుణంగా దర్శకుడు ఈ చిత్రాన్ని ఫారెన్ లో షూట్ చేయాలనీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

 నాగార్జునే స్వయంగా

నాగార్జునే స్వయంగా

తొలి ప్రేమ చిత్రంలో వెంకీ అట్లూరి పనితనం గమనించిన నాగార్జున స్వయంగా అతడిని కలిసినట్లు తెలుస్తోంది. అఖిల్ తో ఓ సినిమా చేయాలనీ నాగ్ కోరాడట. వెంటనే వెంకీ అఖిల్ కోసం కథ సిద్ధం చేశాడు. వెంకీ మరో మారు ప్రేమ కథతో మ్యాజిక్ చేస్తే అఖిల్ కు తొలి హిట్ ఖాతాలో పడ్డట్లే.

కూల్ టైటిల్

కూల్ టైటిల్

రొమాంటిక్ ప్రేమ కథగా రూపొందే ఈ చిత్రం కోసం ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ మజ్ను అనే టైటిల్ దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. తొలిప్రేమ చిత్రానికి సంగీతం అందించితిన తమన్ ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X