ప్రభాస్‌తో మందేస్తే.. ఆ కిక్కే వేరంటా!, వాళ్లిద్దరిని మాత్రం భరించలేరట: అఖిల్ 'పార్టీ' కహానీ..
సినీ ఇండస్ట్రీలో గ్రూపులు మెయింటైన్ చేయడం కామన్. కమెడియన్లు, నటులు, హీరోలు.. ఇలా చాలామందికి గ్రూపులున్నాయి. సంతోష సమయాల్ని ఎంజాయ్ చేయడానికో.. కష్టాల్లో ఉన్నప్పుడు కలుసుకోవడానికో.. అంతా కలిసి ఒక చోట చేరుతుంటారు.
Recommended Video

ఇదే తరహాలో అక్కినేని నటవారసుడు అఖిల్ కు కూడా ఓ గ్యాంగ్ ఉందట. అది సాదాసీదా గ్యాంగ్ కాదండోయ్. వాళ్లంతా ఒక చోట చేరితే రచ్చ రచ్చే అంటున్నాడు. ఇంతకీ ఎవరా గ్యాంగ్?.. ఏంటా విశేషాలు.

పార్టీ చేసుకుంటే:
తన తాజా ఇంటర్వ్యూలో మందు పార్టీల గురించి స్పందించాడు అఖిల్. రానాతో కలిసి పార్టీ చేసుకుంటే.. ఆ పార్టీలో ఇంకెవరు ఉండాలని కోరుకుంటారన్న ప్రశ్నకు.. మరో మాట లేకుండా 'ప్రభాస్' అని చెప్పేశాడు అఖిల్.

ప్రభాస్ ఉంటే.. ఆ కిక్కే వేరు:
తానెప్పుడు పార్టీ ప్లాన్ చేసినా అక్కడ రానా ఉండాల్సిందే అన్నాడు అఖిల్. తనకు అలా అలవాటైపోయిందన్నాడు. తామిద్దరం కలిసి సిట్టింగ్ వేస్తే.. ఎక్కువగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే అని చెప్పాడు. పార్టీలో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరు అన్న తరహాలో అఖిల్ బదులిచ్చాడు.

కచ్చితంగా చరణ్‌కు కాల్ :
తనకు, రానాకు రాంచరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అఖిల్ చెప్పాడు. పార్టీ ఉందంటే చరణ్‌కు కచ్చితంగా కాల్ చేస్తానని అన్నారు. పార్టీలో తామంతా కూల్‌గా ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.

వాళ్లను భరించలేం:
తమ గ్యాంగ్ లోకి మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ చేరారంటే మాత్రం రచ్చ రచ్చే అంటున్నాడు అఖిల్. వాళ్లిద్దరూ చేసే అల్లరిని భరించడం తమవల్ల కాదన్నాడు. 'హలో' సినిమా ప్రమోషన్లలో భాగంగా అఖిల్ మీడియాతో ఈ విషయాలు పంచుకున్నాడు. హలో సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











