ఇంట్లో చూస్తుంటా.. నాన్న పోలీస్ ఆఫీసర్‌లాగే.. అఖిల్!
కింగ్ నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో చాలా కలం తరువాత వస్తున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటించితిన చిత్రం ఇది. ముంబై మాఫియా నేపథ్యంలో ఉత్కంఠ భరిత యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రీరిలీజ్ వేడుకకు నాగార్జున, వర్మతోపాటు అఖిల్, నాగచైతన్య హాజరయ్యారు.
అఖిల్ మాట్లాడుతూ.. పాతికేళ్ల క్రితం శివ చిత్రం కోసం నాన్న, వర్మ గారు ఎంత కష్టపడ్డారో, ఎంత ఎనర్జీతో పనిచేసారో ఆఫీసర్ చిత్రం కోసం కూడా అదేవిధంగా పనిచేశారని అఖిల్ తెలిపాడు. ఇది తనలాంటి యువ నటులకు స్ఫూర్తినిచ్చే అంశం అని అఖిల్ తెలిపాడు. నాన్నని ఇంట్లో చూస్తుంటా.. ఆయన క్రమశిక్షణ, కష్టపడేతత్వం నిజంగానే పోలీస్ అధికారిని గుర్తు చేస్తాయని అఖిల్ తెలిపాడు. జూన్ 1 న రాబోతున్న ఆఫీసర్ చిత్రానికి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.



Click it and Unblock the Notifications











