ఏమున్నాడ్రా బాబు మా అన్నయ్య.. పెళ్ళైన తరువాత.. స్పీచ్‌తో అదరగొట్టిన అఖిల్!
Recommended Video

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం సెప్టెంబర్ 13న వినాయచవితి కానుకగా విడుదల కాబోతోంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో అత్తగా కీలక పాత్రలో నటించింది. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని అతిధులుగా హాజరయ్యారు. అన్నయ్య ఈవెంట్ కు అఖిల్ కూడా హాజరయ్యాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో అఖిల్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది.

స్టేజి మీద
తన సోదరుడు నాగచైతన్య గురించి అఖిల్ మాట్లాడుతూ.. నేను స్టేజిమీద ఎప్పుడు మాట్లాడాలని అనుకున్నా సరిగా మాటలు రావు. కానీ ఈ రోజు అన్నయ్య గురించి మాట్లాడుతుంటే మాటలు తన్నుకుని వస్తున్నాయి అంటూ అఖిల్ తన స్పీచ్ ప్రారంభించాడు.

ఏమున్నాడ్రా బాబు
మారుతి గారు కరెక్ట్ టైంలో కరెక్ట్ హీరోని పట్టారు. ఇటీవలే అన్నయ్య పెళ్లి చేసుకుని అల్లుడయ్యాడు. సరిగ్గా ఈ సమయంలోనే మారుతిగారు అన్నయ్యని సినిమాలో కూడా అల్లుడు చేశాడు. పెళ్లి చేసుకున్న తరువాత అన్నయ్య ముఖంలో గ్లో పెరిగింది. ఏమున్నాడ్రా బాబు మా అన్నయ్య అంటూ అఖిల్ ప్రేక్షకులని అలరించాడు.

హలొ చిత్రంలో
రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ.. రమ్యకృష్ణగారు నాకు హలో చిత్రంలో అమ్మ. ఈ చిత్రంలో మా అన్నయ్యకు అత్తగా మారింది అని తెలిపాడు. హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ కు కూడా అఖిల్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

ట్రైలర్ చూడగానే
శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ చూడగానే పెద్ద హిట్ కొట్టబోతున్నాం అని అనిపించిందని అఖిల్ తెలిపాడు. నాన్న చెప్పినట్లుగానే ఈ చిత్రం అల్లరి అల్లుడు అంత పెద్ద హిట్ అవుతుందని వ్యాఖ్యానించాడు.

స్థంభం లాంటివారు
ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డిని అఖిల్ గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఆయన మరణించిన సంగతి తెలిసిందే. రవీందర్ రెడ్డి తమ కుటుంబానికి స్థంభం లాంటివారని అఖిల్ తెలిపాడు. ఆయన మృతికి సంతాపంగా ఒకనిమిషం మౌనం పాటించారు.


Click it and Unblock the Notifications











